Breaking News

Asia Cup: నిరీక్షణ ముగించాలని టీమిండియా! సమష్టిగా రాణిస్తూ శ్రీలంక

Published on Sun, 09/17/2023 - 01:38

Asia Cup 2023 Final Ind VS SL: ద్వైపాక్షిక సిరీస్‌లు కాకుండా మూడు అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న  అంతర్జాతీయ టోర్నీలలో భారత జట్టు విజేతగా నిలిచి ఐదేళ్లయింది. 2018లో ఆసియా కప్‌ టైటిల్‌ సాధించాక భారత జట్టు మరో టోర్నీలో  చాంపియన్‌గా నిలువలేదు.

2019 వన్డే ప్రపంచకప్‌లో, 2022 టి20  ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌లో ఓడిన టీమిండియా... 2019, 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల చేతుల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టోర్నీ టైటిల్‌ నిరీక్షణ ముగించేందుకు భారత జట్టుకు ఆసియా కప్‌ రూపంలో మరో అవకాశం దక్కింది. స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకుంటున్న శ్రీలంకతో నేడు జరిగే ఫైనల్లో టీమిండియా ‘ఢీ’కొంటుంది.

తుది పోరులో గెలిచి భారత జట్టు టైటిల్‌ నిరీక్షణకు తెరదించుతుందా లేదా మరికొన్ని నెలలు పొడిగిస్తుందా మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. 

కొలంబో: వర్షంతో దోబూచులాడిన ఆసియా కప్‌ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది. వచ్చే నెలలో మొదలయ్యే వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భారత్, శ్రీలంక జట్లకు ఈ టోర్నీ ఉపయోగపడుతోంది. బంగ్లాదేశ్‌తో చివరి ‘సూపర్‌–4’ మ్యాచ్‌లో అనూహ్యంగా  ఓడిపోయిన భారత జట్టు ఫైనల్‌ను మాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు.

వాళ్లంతా వచ్చేస్తున్నారు
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్, సిరాజ్, బుమ్రా ఫైనల్లో బరిలోకి దిగుతారు. అక్షర్‌ పటేల్‌ చేతి వేళ్లకు గాయం కావడంతో అతను ఫైనల్‌కు దూరమయ్యాడు. అక్షర్‌ పటేల్‌కు ప్రత్యామ్నాయంగా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను శనివారం కొలంబోకు రప్పించింది.

బ్యాటింగ్‌ పరంగా భారత్‌ పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్, కోహ్లి, కేఎల్‌ రాహుల్, హార్దిక్‌ పాండ్యా మెరిస్తే భారత్‌ భారీ స్కోరు చేయడం ఖాయం. ఈ టోర్నీలో గిల్, కోహ్లి, రాహుల్‌ ఒక్కో సెంచరీ కూడా చేశారు. బౌలింగ్‌లోనూ భారత్‌ సమతూకంగా ఉంది. జస్‌ప్రీత్‌ బుమ్రా, సిరాజ్, పాండ్యా పేస్‌తో ఆకట్టుకుంటే.. కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగలరు.  

సమష్టిగా రాణిస్తూ... 
ఆసియా కప్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక ఏడో టైటిల్‌పై గురి పెట్టింది. భారత్‌ అత్యధికంగా ఏడుసార్లు ఆసియా కప్‌ టైటిల్‌ను సాధించింది. పలువురు స్టార్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా ఈ టోర్నీలో శ్రీలంక స్ఫూర్తిదాయక ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. దాసున్‌ షనక నాయకత్వంలో తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని శ్రీలంక పట్టుదలతో ఉంది.

బ్యాటింగ్‌లో కుశాల్‌ మెండిస్, నిసాంక, అసలంక, సమర విక్రమపై లంక ఆశలు పెట్టుకుంది. షనక, ధనంజయ డిసిల్వా, వెలలాగె ఆల్‌రౌండ్‌ పాత్రలను పోషిస్తారు. గాయం కారణంగా స్పిన్నర్‌ తీక్షణ ఫైనల్‌కు దూరమయ్యాడు. పతిరణ, కసున్‌ రజిత తమ పేస్‌తో భారత బ్యాటర్లను ఏమేరకు కట్టడి చేస్తారో చూడాలి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)