Breaking News

IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!

Published on Thu, 07/23/2026 - 12:42

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌ల తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల  మధ్య గురువారం నాటి తొలి టీ20కి హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదిక. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నుంచి ఓపెనర్‌ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. వైభవ్‌ సూర్యవంశీని మాత్రం కొనసాగించింది.

అదే విధంగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, హర్ష్‌ దూబే, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌ తదితర యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అశోక్‌ శర్మ, యశ్‌ ఠాకూర్‌లను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా.. రింకూ సింగ్‌ను కూడా తిరిగి పిలిపించింది.

అభిషేక్‌ జోడీగా ఎవరు?
ఈ నేపథ్యంలో జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతున్న అంశం ఆసక్తికరంగా మారింది. అభిషేక్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా.. చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీని ఆడిస్తారా? లేదంటే వైభవ్‌ను ఎంపిక చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్‌ పర్యటనలో వైభవ్‌ 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు.

అయితే, హరారే వేదికగా ఈ ఏడాది అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై వైభవ్‌ సూర్యవంశీ 80 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించి.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. కానీ టీమిండియా తరఫున అరంగేట్రం తర్వాత మాత్రం అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు.

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌కు అవకాశం ఉంటుందా?
అదే సమయంలో గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌.. ఈ ఏడాది కూడా 510 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోనే పంజాబ్‌ తరఫున ప్రభ్‌సిమ్రన్‌ ఈ మేరకు రాణించాడు.

నా జట్టు ఇదే
ఇలాంటి తరుణంలో భారత మాజీ క్రికెటర్‌ ఎస్‌. బద్రీనాథ్‌ తన తుదిజట్టులో ఓపెనర్‌గా వైభవ్‌ సూర్యవంశీకే పెద్దపీట వేశాడు. వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌, నాలుగో నంబర్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ఐదో స్థానంలో వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మను కొనసాగించిన బద్రీనాథ్‌.. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండర్లు శివం దూబే, సూర్యాంశ్‌ షెడ్గేలను ఎంచుకున్నాడు. రింకూ సింగ్‌ను మాత్రం పక్కనపెట్టాడు.

ఇక స్పిన్‌ విభాగంలో హర్ష్‌ దూబే, రవి బిష్ణోయి రూపంలో ఇద్దరిని ఎంపిక చేసిన బద్రీనాథ్‌.. పేస్‌ దళంలో ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌లకు చోటిచ్చాడు.

జింబాబ్వేతో తొలి టీ20కి బద్రీనాథ్‌ ఎంచుకున్న జట్టు
వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివం దూబే, సూర్యాంశ్‌ షెడ్గే, హర్ష్‌ దూబే, రవి బిష్ణోయి, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌.

చదవండి: ICC ODI WC 2027: దమ్ముంటే అతడిని తప్పించండి

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)