Breaking News

ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడు! పర్లేదు.. అప్పుడప్పుడు ఇలా జరిగితే..

Published on Tue, 07/25/2023 - 14:50

Wasim Jaffer rates Shubman Gill's performances: వెస్టిండీస్‌తో సిరీస్‌లో యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ ఘనంగా తన ఆగమనాన్ని చాటగా.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్‌ కిషన్‌ సైతం తన మార్కు చూపించాడు. డొమినికాలో తొలి టెస్టులో యశస్వి 171 పరుగులతో రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

యశస్వి అలా.. ఇషాన్‌ ఇలా
ఇక ట్రినిడాడ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.

గిల్‌ మాత్రం విఫలం
వీరిద్దరు ఇలా తమకు వచ్చిన మొదటి అవకాశాలను ఇలా సద్వినియోగం చేసుకుంటే.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా రెగ్యులర్‌ ఓపెనర్‌ అయిన శుబ్‌మన్‌ గిల్‌ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏరికోరి మూడో స్థానంలో వచ్చిన అతడు రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు.

మొదటి మ్యాచ్‌లో 6 పరుగులకే పెవిలియన్‌ చేరిన గిల్‌.. రెండో మ్యాచ్‌లో వరుసగా 10, 29(నాటౌట్‌) పరుగులు సాధించాడు. దీంతో అనవసరంగా మూడో స్థానంలో వచ్చి పిచ్చి ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడంటూ శుబ్‌మన్‌ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి.

1-5.. ఎక్కడైనా ఆడగలడు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌.. గిల్‌కు అండగా నిలిచాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 1-5 వరకు ఏ స్థానంలో అయినా ఆడగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. ‘‘గిల్‌ మంచి బ్యాటర్‌. తనలాంటి ప్లేయర్‌ ఓపెనర్‌గా రాణించగలడు. ఐదో స్థానం వరకు ఎక్కడైనా సరే బ్యాటింగ్‌ చేయగలడు.

అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో అతడు మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టే విండీస్‌లో తను వన్‌డౌన్‌లో రావడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. ఒక్కోసారి 150 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ చేసి వెంటనే బ్యాటింగ్‌ చేయాలంటే ఓపెనర్లకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

పదికి నాలుగు మార్కులు
కానీ నంబర్‌ 3లో ఆడే వారికి కాస్త కుదురుకునే సమయం దొరుకుతుంది’’ అని వసీం జాఫర్‌ జియో సినిమా షోలో తన అభిప్రాయం పంచుకున్నాడు. కానీ, గిల్‌కు విండీస్‌ టూర్‌లో మాత్రం పదికి నాలుగు మార్కులు మాత్రమే వేస్తానని చెప్పడం విశేషం. అయితే, ఇది ఆరంభమే కాబట్టి గిల్‌ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జాఫర్‌.. అతడికి కాస్త సమయం ఇవ్వాలని పేర్కొన్నాడు.

చదవండి: క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌.. చూస్తే మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌
శివాలెత్తిన సికందర్‌ రజా.. ఫాస్టెప్ట్‌ హాఫ్‌ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)