Breaking News

Ind Vs WI: విండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌!

Published on Wed, 07/27/2022 - 16:07

India Tour Of West Indies 2022- T20 Series: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టాపార్డర్‌ బ్యాటర్‌, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అతడు కోవిడ్‌ బారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకున్నట్లు సమాచారం.

అయితే, రాహుల్‌ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన బీసీసీఐ మెడికల్‌ కమిటీ.. మరో వారం రోజుల పాటు అతడిని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో విండీస్‌తో టీ20 సిరీస్‌ మొత్తానికి అతడు దూరం కానున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 


కేఎల్‌ రాహుల్‌(PC: BCCI)

కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు గాయపడ్డ కేఎల్‌ రాహుల్‌.. జర్మనీలో స్పోర్ట్స్‌ హెర్నియాకు చికిత్స చేయించుకున్నాడు.ఆ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడికి కరోనా సోకగా ఐసోలేషన్‌కు వెళ్లాడు. 

అయితే కోవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు తగిన సమయం లేకపోవడంతోనే వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైనట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇక బుధవారం (జూలై 27) నాటి ఆఖరి వన్డే తర్వాత.. శుక్రవారం(జూలై 29) నుంచి టీమిండియా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ మొదలు కానుంది. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే విండీస్‌కు చేరుకుంది.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, కేఎల్‌ రాహుల్‌*, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, శ్రేయాస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్, రిషబ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్‌ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌.
చదవండి: T20 WC 2022: అతడి వల్ల టీమిండియాకు ఒరిగేదేమీ లేదు! ఒకవేళ టైటిల్‌ గెలిస్తే..
World Cup 2023: అందుకే గబ్బర్‌ కెప్టెన్‌ అయ్యాడు! రోహిత్‌ శర్మ కోరుకుంటున్నది అదే!

Videos

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది: వైఎస్ జగన్

కేసీఆర్ తో పాటు హరీష్‌రావు, ఈటలకు నోటీసులు

ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే దిగిపోవాలి: తిరుపతి మహిళలు

Sudarshan Reddy: హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోని పచ్చ ఖాకీలు

Photos

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)