Breaking News

ఈసారి యశస్వి మిస్సయ్యాడు! అయితేనేం అరుదైన రికార్డుతో..

Published on Fri, 07/21/2023 - 13:05

West Indies vs India, 2nd Test- Yashasvi Jaiswal Record: టీమిండియా యువ బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌ జోరు మీదున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్‌.. 171 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. తద్వారా ఈ 21 ఏళ్ల లెఫ్టాండర్‌ ఎవరికీ సాధ్యం కాని రీతిలో పిన్న వయసులోనే మొదటి టెస్టులోనే 150 పరుగుల మార్కు అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

శిఖర్‌ ధావన్‌ రికార్డు బద్దలు
దీనితో పాటు మరెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇక రెండో టెస్టులోనూ ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 74 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 57 పరుగులు సాధించాడు. తన కెరీర్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో రాణించిన యశస్వి జైశ్వాల్‌.. రెండో టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను అధిగమించాడు.

రోహిత్‌, గంగూలీ తర్వాత
భారత్‌ తరఫున తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. శిఖర్‌ ధావన్‌ను వెనక్కినెట్టి రోహిత్‌ శర్మ, సౌరవ్‌ గంగూలీ తర్వాతి స్థానం ఆక్రమించాడు.

ఈసారి సెంచరీ మిస్‌ అయినా
ఇదిలా ఉంటే వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ట్రినిడాడ్‌ వేదికగా గురువారం ఆరంభమైన రెండో టెస్టులోనూ పట్టు బిగించింది. తొలిరోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, ఈసారి సెంచరీ మిస్‌ అయినా అర్ధ శతకంతో మెరిసి మరో అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

కెరీర్‌లో మొదటి రెండు టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5 బ్యాటర్లు వీరే!
1.రోహిత్‌ శర్మ- 288 పరుగులు
2.సౌరవ్‌ గంగూలీ- 267 పరుగులు
3.యశస్వి జైశ్వాల్‌- 228 పరుగులు
4.శిఖర్‌ ధావన్‌- 210 పరుగులు
5.పృథ్వీ షా- 204 పరుగులు.

చదవండి: Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే..

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)