Breaking News

చరిత్ర సృష్టించిన ధ్రువ్‌ జురెల్‌.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్‌

Published on Tue, 10/14/2025 - 15:38

టీమిండియా యువ క్రికెటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (Dhruv Jurel) అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం నుంచి ఇప్పటికి వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్ కుమార్‌ (Bhuvneshwar Kumar) పేరిట ఉండేది. వెస్టిండీస్‌తో రెండో టెస్టు (IND vs WI 2nd Test) సందర్భంగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు.

 ఏడు వికెట్ల తేడాతో జయభేరి
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా టీమిండియా స్వదేశంలో విండీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలుత అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్‌ సేన.. ఢిల్లీలో మంగళవారం ముగిసిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

కేఎల్‌ రాహుల్‌తో కలిసి
తద్వారా విండీస్‌తో టెస్టు సిరీస్‌ను భారత్‌ 2-0తో వైట్‌వాష్‌ చేసింది. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్టులో జురెల్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 79 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులతో అజేయంగా నిలిచి.. కేఎల్‌ రాహుల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

సరికొత్త చరిత్ర
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధ్రువ్‌ జురెల్‌ గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ కారణంగా కొన్నిసార్లు బెంచ్‌కే పరిమితమైన జురెల్‌.. ఇప్పటికి ఏడు టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఓ సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 761 పరుగులు సాధించాడు.

ఈ క్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం నుంచి భారత్‌ తరఫున ఆడిన ఏడు టెస్టుల్లోనూ విజయం సాధించిన జట్లలో భాగమైన తొలి ఆటగాడిగా జురెల్‌ నిలిచాడు. అంతకు ముందు ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన అరంగేట్రం (2013) నుంచి వరుసగా ఆరు టెస్టుల్లో గెలిచిన భారత జట్టులో భాగమయ్యాడు.

భారత్‌ తరఫున వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన క్రికెటర్లు
👉ధ్రువ్‌ జురెల్‌- 7
👉భువనేశ్వర్‌ కుమార్‌- 6
👉కరుణ్‌ నాయర్‌- 4
👉వినోద్‌ కాంబ్లీ- 4
👉రాజేశ్‌ చౌహాన్‌- 4. 

చదవండి: IND vs WI: టీమిండియా వ‌ర‌ల్డ్ రికార్డు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)