Breaking News

జైస్వాల్‌తో ఓవరాక్షన్‌.. విండీస్‌ ప్లేయర్‌కు భారీ షాక్‌

Published on Sun, 10/12/2025 - 19:48

న్యూఢిల్లీ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా ఓపెనర్యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) పట్ల దురుసుగా ప్రవర్తించిన వెస్టిండీస్ఫాస్ట్బౌలర్జేడన్సీల్స్కు (jayden Seales) ఐసీసీ షాకిచ్చింది

మ్యాచ్తొలి రోజు టీమిండియా బ్యాటింగ్చేస్తుండగా.. ఇన్నింగ్స్‌ 29 ఓవర్లో సీల్స్ఓవరాక్షన్చేశాడు. ఫాలో త్రూ చేసే క్రమంలో బంతిని జైస్వాల్పైకి ప్రమాదకరంగా విసిరాడు. బంతి జైస్వాల్ప్యాడ్స్పై బలంగా తాకింది

దీన్ని సీరియస్గా పరిగణించిన ఐసీసీ సీల్స్కు డీమెరిట్పాయింట్అలాట్చేయడంతో పాటు అతని మ్యాచ్ఫీజ్లో 25 శాతం కోత విధించింది. ఐసీసీ కోడ్ఆఫ్కాండక్ట్లో ఆర్టికల్‌ 2.9 నిబంధన ప్రకారం ఆటగాడు బంతిని లేదా ఏదైన క్రికెట్సమాగ్రిని ఇతర ఆటగాళ్లపైకి కానీ వారి సమీపంలోకి కాని విసరకూడదు. ఇలా చేస్తే ఐసీసీ కోడ్ఆఫ్కాండక్ట్ఉల్లంఘన కిందికి వస్తుంది.

సీల్స్విషయంలోనూ ఇదే జరిగింది. పైగా సీల్స్తాను చేసిన పనిని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని జైస్వాల్పైకి విసరలేదని రిఫరీ పైక్రాఫ్ట్కు వివరించాడు. రనౌట్చేసే ప్రయత్నంలో అలా జరిగిందని అన్నాడు. సీల్స్వాదనను సైతం పరిగణలోకి తీసుకున్న ఐసీసీ పలుమార్లు సదరు సన్నివేశాన్ని పరిశీలించి, సీల్స్దే తప్పిదమని పేర్కొంది

జైస్వాల్అప్పటికే క్రీజ్లో ఉన్నా సీల్స్అనవసరంగా బంతిని విసిరాడని నిర్దారించింది. అందుకే అతనికి డీమెరిట్పాయింట్తో పాటు మ్యాచ్ఫీజ్లో కోత విధించింది. 24 వ్యవధిలో సీల్స్కు ఇది రెండో డీమెరిట్పాయింట్‌. మధ్యలో అతను మరో తప్పు చేస్తే నిషేధానికి గురయ్యే ప్రమాదముంది.

మ్యాచ్విషయానికొస్తే.. మ్యాచ్లో వెస్టిండీస్‌ ఫాలో ఆన్‌ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌ యాదవ్‌ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పోరాడుతోంది. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్‌ క్యాంప్‌బెల్‌ (87), షాయ్‌ హోప్‌ (66) అసమానమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. 

మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు విండీస్ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. యశస్వి జైస్వాల్‌ (175), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (129 నాటౌట్‌) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్‌ (518/5) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 

సాయి సుదర్శన్‌ (87) సెంచరీని మిస్‌ చేసుకోగా.. కేఎల్‌ రాహుల్‌ 38, నితీశ్‌ రెడ్డి 43, జురెల్‌ 44 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో వార్రికన్‌కు 3, ఛేజ్‌కు ఓ వికెట్‌ దక్కింది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.

చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌

 

 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు