Breaking News

శుబ్‌మన్‌ గిల్‌ వెళ్తాడు.. కానీ: బీసీసీఐ

Published on Wed, 11/19/2025 - 15:41

టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కీలక అప్‌డేట్‌ అందించింది. గిల్‌ గువాహటికి ప్రయాణం చేస్తాడని స్పష్టం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే.

మెడ నొప్పి తీవ్రం కావడంతో
ఇందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా గిల్‌ భారత తొలి ఇన్నింగ్స్‌ సమయంలో గాయపడ్డాడు. మెడ నొప్పి తీవ్రం కావడంతో మైదానం వీడాడు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గిల్‌ను ఆస్పత్రికి తరలించిన బీసీసీఐ.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఐసీయూలో ఉంచి చికిత్స అందించింది.

ప్రస్తుతం గిల్‌ పరిస్థితి బాగానే ఉంది. అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. కానీ మెడ నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు. దీంతో బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో గిల్‌ విమాన ప్రయాణం చేస్తే.. నొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు సమాచారం బయటకు వచ్చింది.

దీంతో సౌతాఫ్రికాతో గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టుకు గిల్‌ అందుబాటులో ఉండడనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ తాజాగా గిల్‌ ఆరోగ్యం గురించి కీలక అప్‌డేట్‌ అందించింది.

శుబ్‌మన్‌ గిల్‌ వెళ్తాడు.. కానీ
ఈ మేరకు.. ‘‘కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మెడ నొప్పితో బాధపడ్డాడు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాము.

మరుసటి రోజు అతడు డిశ్చార్జ్‌ అయ్యాడు. చికిత్సకు గిల్‌ స్పందిస్తున్నాడు. నవంబరు 19న జట్టుతో కలిసి అతడు గువాహటికి ప్రయాణం చేస్తాడు. అయితే, బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉంటాడు. పరిస్థితిని బట్టి అతడిని రెండో టెస్టులో ఆడించాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటాం’’ అని బీసీసీఐ బుధవారం నాటి ప్రకటనలో పేర్కొంది.

చదవండి: ఆల్‌టైమ్‌ టీ20 జట్టు.. రోహిత్‌, కోహ్లికి దక్కని చోటు!.. ఓపెనర్లుగా వారే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)