Breaking News

రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?

Published on Sun, 11/30/2025 - 15:54

సౌతాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా వన్డేల్లో పునరాగమనం చేసిన టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ నిరాశపరిచాడు. చాన్నాళ్ల తర్వాత యాభై ఓవర్ల ఫార్మాట్లో వచ్చిన అవకాశాన్ని ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మెరుగ్గానే ఇన్నింగ్స్‌ ఆరంభించినప్పటికీ నిలకడగా ముందుకు సాగలేకపోయాడు.

ఈ నేపథ్యంలో జైస్వాల్‌ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయిన జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో మాత్రం అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. టీ20లలో శుబ్‌మన్‌ గిల్‌- అభిషేక్‌ శర్మ, వన్డేల్లో రోహిత్‌ శర్మ- శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరిలో ఎవరైనా గైర్హాజరైతే మాత్రమే జట్టులో చోటు దక్కుతోంది.

తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌ గిల్‌ గాయం కారణంగా దూరం కాగా.. జైస్వాల్‌ జట్టులోకి వచ్చాడు. రాంచి వేదికగా ప్రొటిస్‌ జట్టుతో ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో తొలి బంతికే ఫోర్‌ బాది సత్తా చాటిన జైసూ.. రెండో బంతిని కూడా బౌండరీకి తరలించాడు.

ఆ తర్వాత సిక్సర్‌ బాది దూకుడు ప్రదర్శించిన జైస్వాల్‌కు ప్రొటిస్‌ పేసర్‌ నండ్రీ బర్గర్‌ చెక్‌ పెట్టాడు. నాలుగో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బర్గర్‌... తొలి బంతిని అవుట్‌ సైడాఫ్‌ దిశగా సంధించగా.. జైస్వాల్‌ గాల్లోకి లేపాడు.  ఈ క్రమంలో వేగంగా స్పందించిన వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ బంతిని ఒడిసిపట్టగా.. జైసూ పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 18 పరుగులు చేసి నిష్క్రమించాడు.

ఈ నేపథ్యంలో జైస్వాల్‌పై విమర్శలు వస్తున్నాయి. రీఎంట్రీలో సత్తా చాటుతాడనుకుంటే.. నిరాశపరిచాడంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికాతో టెస్టుల్లోనూ జైసూ విఫలమైన విషయం తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్‌లలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ చేసిన స్కోర్లు వరుసగా.. 12, 0, 58, 13. ప్రొటిస్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డ జైస్వాల్‌.. ఒక్క హాఫ్‌ సెంచరీతో సరిపెట్టాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)