Breaking News

T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

Published on Sat, 02/21/2026 - 10:41

సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2026లో టీమిండియా సత్తా చాటుతోంది. లీగ్‌ దశలో భాగంగా గ్రూప్‌-ఎ నుంచి టాపర్‌గా సూర్యకుమార్‌ సేన సూపర్‌-8కు చేరుకుంది. వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లను ఓడించి అజేయంగా తదుపరి దశలో అడుగుపెట్టింది.

తొలుత దక్షిణాఫ్రికాతో..
ఇక ఇక్కడి నుంచే అసలు సమరం మొదలుకానుంది. గ్రూప్‌-1లో ఉన్న టీమిండియా.. సూపర్‌-8లో తొలుత దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ మొదలుకానుంది.

ప్రాక్టీస్‌లో తలమునకలు
ఈ నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్‌ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఈ క్రమంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) బాదిన షాట్‌ కారణంగా భారత స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) గాయపడినట్లు సమాచారం. హార్దిక్‌ బాదిన బంతి సిరాజ్‌ ఎడమ మోకాలికి బలంగా తగిలినట్లు తెలుస్తోంది.

గాయపడిన పేసర్‌
దీంతో నొప్పితో విలవిల్లాడిన సిరాజ్‌ మధ్యలోనే నెట్‌ సెషన్‌ నుంచి నిష్క్రమించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెవ్‌స్పోర్ట్స్‌ షేర్‌ చేసిన ఈ ఫొటోలలో సిరాజ్‌ కుంటుతూ మైదానం వీడిన తీరు టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

గాయాల బెడద
కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభానికి ముందు నుంచీ టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న సంగతి తెలిసిందే. యువ పేసర్‌, బ్యాట్‌తోనూ అదరగొడుతున్న హర్షిత్‌ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చిన సిరాజ్‌.. గ్రూప్‌ దశలో తొలుత అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.

ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా జ్వరం వల్ల తుదిజట్టు నుంచి తప్పుకోగా.. సిరాజ్‌కు ఈ అవకాశం వచ్చింది. అమెరికాతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ పేసర్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులోకి రావడంతో సిరాజ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఇప్పుడిలా..
మరోవైపు.. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సైతం కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ సైతం గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ.. తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగానే ఉన్నాడు. ఆఖరిగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడు బరిలోకి దిగాడు.

ఇదిలా ఉంటే.. పటిష్ట సౌతాఫ్రికాతో పోరుకు ముందు సిరాజ్‌ కూడా గాయపడటం గమనార్హం. కాగా సూపర్‌-8లో భారత్‌.. సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఎదుర్కొంటుంది. ఈ దశలో సత్తా చాటితేనే సెమీ ఫైనల్‌ చేరే అవకాశం ఉంటుంది.
UPDATE: T20 WC 2026: టీమిండియా కొంప‌ముంచిన గంభీర్‌.. నెటిజ‌న్లు ఫైర్

చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)