Breaking News

హార్దిక్‌ పాండ్యా ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. తిలక్‌ విధ్వంసం

Published on Fri, 12/19/2025 - 20:55

సౌతాఫ్రికాతో ఐదో టీ20లో టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా అదరగొట్టాడు. అహ్మదాబాద్‌ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం పదహారు బంతుల్లోనే హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ
తద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన రెండో ఆటగాడిగా హార్దిక్‌ పాండ్యా నిలిచాడు. ఈ క్రమంలో అభిషేక్‌ శర్మను అధిగమించి.. యువరాజ్‌ సింగ్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 2-1తో ఆధిక్యంలో ఉంది టీమిండియా.

తిలక్‌ వర్మ విధ్వంసం
ఇక శుక్రవారం అహ్మదాబాద్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-1తో గెలుచుకోవాలనే సంకల్పంతో బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్‌ (22 బంతుల్లో 37), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 34) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో దుమ్ములేపాడు.

నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) మరోసారి తీవ్రంగా నిరాశపరచగా.. అతడు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి, స్టాండ్స్‌లోకి తరలించి అభిమానులను ఉర్రూతలూగించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 16 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు దాటేశాడు.

 

అనూహ్య రీతిలో
మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 63 పరుగులు సాధించాడు. అయితే, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ బౌలంగ్‌లో షాట్‌ ఆడే క్రమంలో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. 

ఇక తిలక్‌ వర్మ (42 బంతుల్లో 73)  అనూహ్య రీతిలో పందొమ్మిదో ఓవర్‌ ఐదో బంతికి రనౌట్‌ కాగా.. శివం దూబే మూడు బంతుల్లో పది పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్‌ 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ రెండు వికెట్లు తీయగా.. జార్జ్‌ లిండే, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ టీ20 ఫిఫ్టీలు నమోదు చేసింది వీరే
🏏యువరాజ్‌ సింగ్‌- 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ మీద 12 బంతుల్లో ఫిఫ్టీ
🏏హార్దిక్‌ పాండ్యా- 2025లో సౌతాఫ్రికా మీద 16 బంతుల్లో ఫిఫ్టీ
🏏అభిషేక్‌ శర్మ- 2025లో ఇంగ్లండ్‌ మీద 17 బంతుల్లో ఫిఫ్టీ
🏏కేఎల్‌ రాహుల్‌- 2021లో స్కాట్లాండ్‌ మీద 18 బంతుల్లో ఫిఫ్టీ
🏏సూర్యకు​మార్‌ యాదవ్‌- 2022లో సౌతాఫ్రికా మీద 18 బంతుల్లో ఫిఫ్టీ.

చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)