IND vs SA: టాస్‌ పడలేదు.. మ్యాచ్‌ రద్దు

Published on Wed, 12/17/2025 - 18:35

టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్‌ పడకుండానే మ్యాచ్‌ ముగిసిపోయింది. లక్నోలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం.. సాయంత్రం 6.30 నిమిషాలకు టాస్‌ వేయాల్సి ఉండగా పొగమంచు కమ్ముకుంది. దీంతో 6.50 నిమిషాలకు మరోసారి పరిస్థితిని సమీక్షించగా ఎలాంటి మార్పూ లేదు. 

దీంతో 7.30 నిమిషాలకు మరోసారి రివ్యూ చేయగా.. అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. రాత్రి 8 గంటలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా అంపైర్లు మ్యాచ్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

వీడిన సస్పెన్స్‌
ఈసారి అంపైర్లు మైదానం కలియదిరుగుతూ పొగమంచు ప్రభావం ఎలా ఉందో గమనించారు. బ్యాటర్‌, బౌలర్‌, ఫీల్డర్ల పొజిషన్ల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అ‍న్న విషయాన్ని పరిశీలించారు. 

ఈ క్రమంలో చర్చల అనంతరం 8.30 నిమిషాలకు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పుడూ అంపైర్లు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో 9 గంటలకు మరోసారి రివ్యూ జరుగగా.. ఈసారీ స్పష్టత రాలేదు. 9.25 నిమిషాలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించిన అంపైర్లు మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించారు.

రీప్లేస్‌మెంట్‌గా షాబాజ్‌ అహ్మద్‌
కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ టీమిండియాకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు టీ20ల నుంచి అతడు తప్పుకోగా.. బీసీసీఐ షాబాజ్‌ అహ్మద్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది. అదే విధంగా వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి వచ్చాడు. నాలుగో టీ20లో అతడు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.

ఇదిలా ఉంటే.. ఐదు టీ20 సిరీస్‌ల భాగంగా కటక్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా 51 పరుగులతో గెలిచింది. తద్వారా 1-1తో సిరీస్‌ స​మం చేసింది. 

అయితే, ధర్మశాలలో మరోసారి జయభేరి మోగించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉంది. అంతకు ముందు టెస్టుల్లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్‌వాష్‌ చేయగా.. వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1తో గెలుచుకుంది.

చదవండి: నంబర్‌ 1: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)