Breaking News

పంత్‌కు అవకాశాలు ఇస్తూనే ఉంటాం.. సంజూ వెయిట్‌ చేయాల్సిందే: ధావన్‌

Published on Thu, 12/01/2022 - 11:14

Shikhar Dhawan- Sanju Samson- Rishabh Pant: ‘‘దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దానిని బట్టే ఓ ఆటగాడికి తుది జట్టులో చోటు దక్కింది. మ్యాచ్‌ విన్నర్‌ ఎవరో వారికే అవకాశాలు వస్తాయి’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌.. యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు మద్దతు పలికాడు.

కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ మరికొన్ని రోజులు జట్టులో స్థానం కోసం ఎదురుచూడక తప్పదని వ్యాఖ్యానించాడు. కాగా వికెట్‌ కీపర్‌ సంజూ గత కొన్నాళ్లుగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కడం లేదన్న విషయం తెలిసిందే.

మీరు మారరా?
న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లలోనూ ఇదే పునరావృతమైంది. అదే సమయంలో వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న పంత్‌కు మాత్రం ఛాన్స్‌లు వస్తూనే ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గత తొమ్మిది ఇన్నింగ్స్‌లో పంత్‌ సాధించిన స్కోర్లు.. 10, 15, 11, 6, 6, 3, 9, 9 27. 

ఈ పరిణామాల నేపథ్యంలో పంత్‌ను ఆడిస్తూ సంజూ పట్ల కావాలనే వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కివీస్‌ టూర్‌లో సంజూకు కేవలం ఒకే ఒక మ్యాచ్‌ ఆడే అవకాశం ఇచ్చారని.. అదే పంత్‌ ఆడకపోయినా వెనకేసుకొస్తున్నారంటూ ట్రోల్స్‌ వచ్చాయి.

సంజూ వేచి చూడక తప్పదు!
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ మూడో వన్డే అనంతరం కెప్టెన్‌ ధావన్‌ మాట్లాడుతూ.. సంజూ ఇంకొన్నాళ్లు వెయిట్‌ చేయక తప్పదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించగల సత్తా ఉన్న పంత్‌కు తప్పక మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

‘‘కెప్టెన్‌గా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, నేను సరైన జట్టును ఎంపిక చేసుకోవడంలో తడబడను. సంజూ శాంసన్‌ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు.

అయితే, కొన్నిసార్లు అవకాశాల కోసం ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుంది. పంత్‌ నైపుణ్యం గల ఆటగాడు. మ్యాచ్‌ విన్నర్‌. కష్టకాలంలో తనకు అండగా నిలవాల్సి ఉంటుంది’’ అని సంజూను కాదని పంత్‌కు అవకాశం ఇవ్వడాన్ని ధావన్‌ సమర్థించుకున్నాడు. కాగా తాత్కాలిక కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం ఇదే తరహాలో పంత్‌కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. 

చదవండి: Sanju Samson: పంత్‌ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి అండగా ఉంటాం.. ఎవరిని ఆడించాలో తెలుసు: వీవీఎస్‌ లక్ష్మణ్‌
Ind Vs NZ: 12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే..
Lionel Messi: ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా! అయినా.. మెస్సీ అభిమానులకు తప్పని నిరాశ!

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)