Breaking News

న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌.. టీమిండియాలో కీలక మార్పు..?

Published on Mon, 10/28/2024 - 11:54

న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒకే ఒక స్పెషలిస్ట్‌ పేసర్‌తో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని వాంఖడే పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున అదనపు స్పిన్నర్‌ బరిలోకి దిగే అవకాశం​ ఉంది. 

ఇలా చేస్తే స్పెషలిస్ట్‌ పేసర్‌గా బుమ్రా ఒక్కడికే అవకాశం దక్కుతుంది. అదనపు స్పిన్నర్‌ కోటాలో అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి రావచ్చు. అక్షర్‌కు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్నందున్న మేనేజ్‌మెంట్‌ ఇతనివైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ అక్షర్‌ తుది జట్టులోకి వస్తే ఆకాశ్‌దీప్‌పై వేటు పడుతుంది. 

ఆకాశ్‌దీప్‌ రెండో టెస్ట్‌ మొత్తంలో కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేశాడు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అయితే అతను బంతిని కూడా పట్టుకోలేదు. వాంఖడే ట్రాక్‌ ఇంచుమించు పూణే పిచ్‌ మాదిరే ఉండే అవకాశం ఉన్నందున టీమిండియా తప్పక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. 

ఆకాశ్‌దీప్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ పేరును సైతం పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. అయితే కుల్దీప్‌కు గజ్జల్లో గాయమైందని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక చేయలేదని తెలుస్తుంది.

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ జయభేరి మోగించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముడో టెస్ట్‌ ముంబై వేదికగా నవంబర్‌ 1 నుంచి ప్రారంభం కానుంది.

కివీస్‌తో మూడో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా

చదవండి: టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)