చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
పేసర్ల పదును... కోహ్లి దూకుడు
Published on Wed, 11/04/2026 - 15:10
నలుగురు ప్రధాన పేస్ బౌలర్ల మొత్తం అనుభవం కలిపి 29 వన్డేలు... న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో నితీశ్ రెడ్డిలాంటి ఆల్‌రౌండర్‌ను కాదని రెగ్యులర్ పేసర్లపై టీమ్ మేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. ఆ నమ్మకం వమ్ము కాలేదు... బౌన్సీ పిచ్‌పై చక్కటి ప్రదర్శనతో మన పేసర్లు సత్తా చాటుతూ ప్రత్యర్థిని కట్టి పడేసి తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఆపై ఛేదనలో ఎప్పటిలాగే కోహ్లి తనదైన శైలిలో చెలరేగిపోయి 80వ అర్ధసెంచరీతో జట్టును విజయం దిశగా నడిపించాడు. పలుమార్లు వాన అంతరాయం కలిగించిన పోరులో చివరకు భారత్‌దే పైచేయి అయింది.
ఆక్లాండ్: టి20ల తరహాలోనే వన్డే సిరీస్‌లో కూడా భారత్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. టిమ్ సీఫెర్ట్ (43 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్లెయిర్ టిక్నర్ (23 బంతుల్లో 34; 1 ఫోర్, 4 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (51 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిగా పట్టుదల కనబర్చారు. పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్షుల్ కంబోజ్ (2/22) రెండు వికెట్లు తీయగా... అర్ష్ దీప్ సింగ్ 4, గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారత్ ఇన్నింగ్స్‌లో 54/1 వద్ద వర్షంతో ఆట నిలిచిపోగా, డక్‌వర్త్–లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని 40 ఓవర్లలో 167 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఆ తర్వాత కూడా 64/1 వద్ద మళ్లీ వర్షం రావడంతో లక్ష్యం 32 ఓవర్లలో 143 పరుగులుగా మారింది. టీమిండియా 22.4 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసి విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లి (51 బంతుల్లో 74; 13 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడుతూ ముందుండి నడిపించగా, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (56 బంతుల్లో 37; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 17.2 ఓవర్లలో 113 పరుగులు జోడించి జట్టు గెలుపును సులువు చేశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యం సాధించగా, రెండో వన్డే శనివారం వెల్లింగ్టన్‌లో జరుగుతుంది.
బౌలర్ల జోరు...
విల్ యంగ్ (9), నికోల్స్ (9) ఆరంభంలోనే అవుట్ కావడంతో కివీస్‌కు సరైన ఆరంభం లభించలేదు. మరోవైపు 7 పరుగుల వద్ద నబీ బౌలింగ్‌లో సునాయాస క్యాచ్‌ను నమన్ వదిలేయడంతో బతికిపోయిన సీఫెర్ట్ దానిని కొంత సద్వినియోగం చేసుకున్నాడు. 10 ఓవర్లలో జట్టు 45 పరుగులు చేసింది. అయితే 11 పరుగుల వ్యవధిలో సీఫెర్ట్, లాథమ్ (3) వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో రోహిత్ అద్భుత ఫీల్డింగ్‌కు మిచెల్ (41 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్ కావడం మరింత దెబ్బ తీసింది. భారత బౌలింగ్ ముందు ఈసారి ఫిలిప్స్ ప్రభావం చూపలేకపోగా... అర్ష్ దీప్ ఓవర్లో మూడు భారీ సిక్సర్లు బాది టిక్నర్ కాస్త మెరుగైన స్కోరును అందించాడు.
పుల్ షాట్‌లతో చెలరేగి...
తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ (0) డకౌట్ కావడంతో భారత్ ఛేదన పేలవంగా ఆరంభమైంది. అయితే గిల్, కోహ్లి కలిసి సమర్థంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. గిల్ జాగ్రత్తగా ఆడగా, కోహ్లి మాత్రం పూర్తిగా దూకుడును ఎంచుకున్నాడు. ముఖ్యంగా తన ట్రేడ్‌మార్క్ కవర్‌డ్రైవ్‌లతో పాటు గతంలో ఎన్నడూ చూడని రీతిలో పుల్ షాట్లతో అతను విరుచుకుపడటం విశేషం. టిక్నర్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన కోహ్లి 35 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మొత్తంగా 12 పుల్ షాట్‌లు ఆడిన అతను ఈ షాట్‌తో 5 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు! లక్ష్యానికి చేరువవుతున్న దశలో 22 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకున్నా...చివరకు 56 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (సి) శ్రేయస్ (బి) అర్ష్ దీప్ 9; సీఫెర్ట్ (సి) (సబ్) రుతురాజ్ (బి) గుర్నూర్ 38; నికోల్స్ (సి) నమన్ (బి) అర్ష్ దీప్ 9; మిచెల్ (రనౌట్) 28; లాథమ్ (సి) అండ్ (బి) గుర్నూర్ 3; ఫిలిప్స్ (సి) శ్రేయస్ (బి) అర్ష్ దీప్ 30; సాంట్నర్ (బి) కంబోజ్ 4; స్మిత్ (సి) కోహ్లి (బి) కంబోజ్ 1; జేమీసన్ (సి) కోహ్లి (బి) అర్ష్ దీప్ 1; డఫీ (నాటౌట్) 15; టిక్నర్ (సి) రాహుల్ (బి) గుర్నూర్ 34; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (40.2 ఓవర్లలో ఆలౌట్) 185. వికెట్ల పతనం: 1–22, 2–40, 3–73, 4–84, 5–97, 6–113, 7–115, 8–131, 9–146, 10–185. బౌలింగ్: అర్ష్ దీప్ 10–0–70–4, ఆఖిబ్ నబీ 6–0–33–0, అన్షుల్ కంబోజ్ 10–2–22–2, గుర్నూర్ బ్రార్ 9.2–0–44–3, అక్షర్ 5–0–12–0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సాంట్నర్ (బి) జేమీసన్ 0; గిల్ (సి) లాథమ్ (బి) స్మిత్ 37; కోహ్లి (సి) సీఫెర్ట్ (బి) డఫీ 74; శ్రేయస్ (సి) నికోల్స్ (బి) డఫీ 15; అక్షర్ (సి) ఫిలిప్స్ (బి) డఫీ 0; రాహుల్ (నాటౌట్) 3; నమన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (22.4 ఓవర్లలో 5 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–1, 2–114, 3–124, 4–124, 5–136. బౌలింగ్: జేమీసన్ 7–0–34–1, డఫీ 7–0–49–3, టిక్నర్ 4–0–38–0, స్మిత్ 4.4–0–21–1.
46 డాట్ బాల్స్...
దాదాపు ఏడాదిన్నర క్రితం అనూహ్యంగా ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో ఏకైక టెస్టు అవకాశం దక్కించుకున్న అన్షుల్ కంబోజ్ ఘోర వైఫల్యంతో తీవ్ర విమర్శలపాలై జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే విండీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసి మళ్లీ పేలవంగా బౌలింగ్ చేశాడు. అయితే తన రెండో వన్డేలో అతను అద్భుత బౌలింగ్‌ను చూపించాడు. తన తొలి స్పెల్‌ను 5–1–12–0తో ముగించిన అతను రెండో స్పెల్‌ను 5–1–10–2తో పూర్తి చేశాడు. మొత్తంగా 46 డాట్ బంతులు వేసి కివీస్‌ను నిలువరించడంలో కీలక పాత్ర పోషించాడు.
The King leaves to a round of applause after scoring match-winning 74. 👏 Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha and Sony LIV. #SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND https://t.co/zDOBL4nH6J
— Sony Sports Network (@SonySportsNetwk) November 4, 2026
ఇవీ చదవండి: IND vs NZ: విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు
IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
Straight into the gap, straight into the celebrations 🤩 Naman Dhir seals India's win with a four! 🥳 Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha and Sony LIV. #SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND https://t.co/CAOwiVZ1Uw
— Sony Sports Network (@SonySportsNetwk) November 4, 2026
Tags : 1