రోహిత్‌ అవుటా? నిజమేనా..? ఇంగ్లండ్‌ బౌలర్‌ రియాక్షన్‌ వైరల్‌

Published on Fri, 03/08/2024 - 14:06

ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. వన్‌డౌన్‌ బ్యాటర్‌, శతక వీరుడు శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 171 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు.

ఈ క్రమంలో.. 135/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. మరో వికెట్‌ నష్టపోకుండా 264 పరుగుల వద్ద నిలిచి.. ఓవరాల్‌గా అప్పటికి 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

అయితే, లంచ్‌ బ్రేక్‌ తర్వాత మళ్లీ మైదానంలో దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. విరామం తర్వాత తొలి బంతికే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌.. రోహిత్‌ శర్మ(103)ను అనూహ్య రీతిలో బౌల్డ్‌ చేశాడు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ బంతి అందుకున్న పేస్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌.. ‘మ్యాజిక్‌’ బాల్‌తో హిట్‌మ్యాన్‌ను పెవిలియన్‌కు పంపాడు.

స్టోక్స్‌ సంధించిన గుడ్‌లెంగ్త్‌ బాల్‌ను షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్‌ విఫలమయ్యాడు. బ్యాట్‌ అంచును తాకిన బంతి అనూహ్యంగా స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఊహించని ఈ పరిణామంతో రోహిత్‌ అవాక్కు కాగా.. ఇంగ్లండ్‌ శిబిరంలోనూ ఆశ్చర్యం వ్యక్తమైంది.

ఐపాడ్‌లో మ్యాచ్‌ చూస్తున్న కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ నోటిపై చేతిని ఆనించి విస్మయం వ్యక్తం చేయగా.. ఫీల్డ్‌లో ఉన్న పేసర్‌ మార్క్‌ వుడ్‌ తలపై రెండు చేతులు పెట్టుకుని.. ‘‘ఏంటిది? నిజమేనా? నమ్మలేకపోతున్నా!’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా రోహిత్‌ శర్మ అవుటైన మరుసటి ఓవర్‌(63)లోనే శుబ్‌మన్‌ గిల్‌(110) కూడా పెవిలియన్‌ చేరాడు. జేమ్‌ ఆండర్సన్‌ వికెట్ల ఖాతాలో 699వ వికెట్‌గా వెనుదిరిగాడు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)