Breaking News

T20 WC: మా ఓటమికి కారణం అతడే: మెకల్లమ్‌

Published on Fri, 03/06/2026 - 15:21

ఇంగ్లండ్‌ కల చెదిరింది. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో అడుగుపెట్టాలనుకున్న బ్రూక్‌ బృందాన్ని టీమిండియా గట్టి షాకిచ్చింది. ముంబై వేదికగా గురువారం నాటి సెమీ ఫైనల్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి భారత్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

ఆఖరి వరకు పోరాడినా ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఇక టీమిండియా గెలుపులో అక్షర్‌ పటేల్‌ (Axar Patel)దీ కీలక పాత్రే. సంజూ శాంసన్‌ బ్యాట్‌తో రాణించగా.. జస్‌ప్రీత్‌ బుమ్రా బంతితో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు అక్షర్‌ అందుకున్న క్యాచ్‌లే గెలుపును టీమిండియా వైపు తిప్పాయి.

ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ (Brendon McCullum) కూడా ఇదే మాట అంటున్నాడు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. అక్షర్‌ అందుకున్న అద్భుత క్యాచ్‌లే మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాయని పేర్కొన్నాడు. స్కై స్పోర్ట్స్‌ క్రికెట్‌తో మాట్లాడుతూ..

అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని
‘‘నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో అక్షర్‌ అందుకున్న ఆ రెండు క్యాచ్‌ల గురించి మాట్లాడాలి. వాంఖడే మైదానంలో ఇలాంటి క్యాచ్‌లు అంత సులువేమీ కాదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసింది.

ముఖ్యంగా అక్షర్‌ అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశాడు. కీలక సమయంలో అతడు రాణించాడు. నిజానికి చాన్నాళ్లుగా వాళ్ల ఫీల్డింగ్‌ అంత గొప్పగా ఏమీ లేదు.. ఈ రోజు మా వాళ్లే ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండే బాగుండేది. ఏదేమైనా వాళ్లకి (టీమిండియా) క్రెడిట్‌ ఇవ్వాల్సిందే’’ అని మెకల్లమ్‌ చెప్పుకొచ్చాడు.

అక్షర్‌ ఫీల్డింగ్‌.. భారత్‌ విజయానికి బాటలు
కాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అక్షర్‌ పటేల్‌ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. తొలుత హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ (5) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే, కెప్టెన్‌, డేంజరస్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ బుమ్రా బౌలింగ్‌లో బంతిని గాల్లోకి తరలించగా.. పాయింట్‌ నుంచి చాలా దూరం పరిగెత్తి అక్షర్‌ బంతిని అందుకున్నాడు.

అయితే, అన్నింటికంటే విల్‌ జాక్స్‌ (35) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్నా పట్టు కోల్పోయినట్లు అనిపించగా.. అక్కడే ఉన్న దూబే వైపు విసరగా అతడు బంతిని క్యాచ్‌ పట్టాడు. ఇలా మ్యాచ్‌ను మలుపుతిప్పిన కీలక క్యాచ్‌లోనూ అక్షర్‌ భాగమయ్యాడు.

చదవండి: టీమిండియా గెలుపునకు ప్రధాన కారణాలు ఇవే

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)