Breaking News

IND vs ENG: శతక్కొట్టిన జైస్వాల్‌.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ అంటే అంతే!

Published on Sat, 08/02/2025 - 18:48

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiwal) శతక్కొట్టాడు. ఓవల్‌ మైదానంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా వంద పరుగుల మార్కును అందుకున్నాడు. 127 బంతుల్లోసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. 

ఇక ఈ సిరీస్‌లో జైసూకు ఇది రెండో శతకం. అంతకు ముందు లీడ్స్‌ వేదికగా తొలి టెస్టులో జైస్వాల్‌ 101 పరుగులు చేశాడు. కాగా ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది. 

ఈ క్రమంలో సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఆఖరిదైన ఐదో మ్యాచ్‌ లండన్‌లో గురువారం మొదలైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్‌ అయింది.

హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలిచాడు
తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి జైస్వాల్‌ గేరు మార్చాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలోనే అర్ధ శతకం (52*) పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. శనివారం దానిని సెంచరీగా మలిచాడు.

టెస్టులలో ఆరోది..
తద్వారా ఈ సిరీస్‌లో రెండో శతకంతో పాటు.. తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఇందులో నాలుగు ఇంగ్లండ్‌ మీద బాదినవే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన టీమిండియా 51 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 

నైట్‌ వాచ్‌మన్‌ ఆకాశ్‌ దీప్‌ అర్ధ శతకం(66)తో చెలరేగగా.. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (11) మాత్రం నిరాశపరిచాడు. జైసూతో కలిసి కరుణ్‌ నాయర్‌ (9*)  పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లండ్‌.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్‌ అయింది.

చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)