Breaking News

IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్‌పై వేటు!

Published on Sat, 07/11/2026 - 14:01

టీ20 ప్రపంచకప్‌ చాంపియన్‌ టీమిండియాకు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్‌కూ సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. ఇక సౌతాంప్టన్‌ వేదికగా శనివారం నాటి ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో వైట్‌వాష్‌ నుంచి టీమిండియా బయటపడుతుంది.

పరువు దక్కాలంటే
ఈ నేపథ్యంలో కనీస పరువు దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైన యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌లలో వరుసగా 97*, 89, 89 పరుగులతో రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజూ శాంసన్‌. అయితే, ఐర్లాండ్‌తో రెండు టీ20లలో 5, 0 పరుగులు చేసిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.

సంజూ శాంసన్‌పై వేటు వేసి
ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్‌ సూర్యవంశీతో అరంగేట్రం చేయించింది. అయితే, పదిహేనేళ్ల ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఇంగ్లండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌లలో 13, 14, 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇందుకు తోడు జట్టు సైతం వరుస పరాజయాలతో సిరీస్‌ కోల్పోయింది.

తిరిగి తుదిజట్టులోకి 
ఇక వైభవ్‌తో పాటు వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ సైతం విఫలమవుతున్నారు. ఇలాంటి తరుణంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్‌ను తిరిగి తుదిజట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్టాండర్లే (అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్‌) ఉండటం కూడా సమస్యగా మారిందని.. ఈసారి సంజూను చేర్చి లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. లేదంటే వైభవ్‌ను కొనసాగించి.. తిలక్‌ వర్మ లేదంటే ఇషాన్‌ కిషన్‌ను తప్పిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

అయితే, తిలక్‌ ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి అతడిని తుదిజట్టు నుంచి తీసేయడం కష్టం. మరోవైపు.. ఇషాన్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్నప్పటికీ.. వన్‌డౌన్‌లో సంజూ ఆడగలడు కాబట్టి అతడు ఇషాన్‌ను రీప్లేస్‌ చేసే అవకాశం ఉంది. ఇక అక్షర్‌ పటేల్‌, ప్రసిద్‌ కృష్ణ స్థానంలో రవి బిష్ణోయి, సూర్యాంశ్‌ షెడ్గే రానున్నట్లు సమాచారం.

ఇంగ్లండ్‌తో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)
అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, శివం దూబే, సూర్యాంశ్‌ షెడ్గే, ప్రిన్స్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయి.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)