Breaking News

శతక్కొట్టిన బెన్‌ స్టోక్స్‌.. ఎనిమిదేళ్ల తర్వాత అలా!.. ఇప్పుడిలా..

Published on Sat, 07/26/2025 - 16:21

టీమిండియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) శతక్కొట్టాడు. మాంచెస్టర్‌ వేదికగా శనివారం నాటి నాలుగో రోజు ఆటలో వంద పరుగుల మార్కును అందుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 34 ఏళ్ల ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. 164 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. కాగా స్టోక్స్‌కు ఇది టెస్టుల్లో పద్నాలుగవ సెంచరీ కాగా.. టీమిండియాపై రెండోది. 

ఇంగ్లండ్‌- భారత్‌ జట్ల మధ్య ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల  సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి మూడు టెస్టుల్లో రెండు గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది.

ఐదు వికెట్లతో చెలరేగిన గిల్‌
ఇరుజట్ల మధ్య బుధవారం నాలుగో టెస్టు మొదలుకాగా.. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా 358 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయింది. స్టోక్స్‌ ఐదు వికెట్లతో చెలరేగి.. గిల్‌ సేనను దెబ్బకొట్టాడు. తద్వారా ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

మూడేళ్లలో తొలిసారి!
అంతేకాదు.. అదే మ్యాచ్‌లో సెంచరీ కూడా కొట్టి స్టోక్స్‌ మాంచెస్టర్‌ టెస్టును మరింత ప్రత్యేకం చేసుకున్నాడు. కాగా గత మూడేళ్లలో టెస్టుల్లో స్టోక్స్‌కు ఇదే మొదటి సెంచరీ కావడం గమనార్హం. నవతరం టాప్‌ ఆల్‌రౌండర్లలో ఒకడైన స్టోక్స్‌ ఈ టెస్టు ద్వారా తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.

ఇదిలా ఉంటే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ దుమ్మురేపుతోంది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (84), బెన్‌ డకెట్‌ (94) మెరుపు అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. జో రూట్‌ 150 పరుగులతో అదరగొట్టాడు. తాజాగా కెప్టెన్‌ స్టోక్స్‌ కూడా సెంచరీతో చెలరేగగా.. 149 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 614 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియా కంటే 256 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

చదవండి: గిల్‌.. నేనైతే ఆ తప్పు చేసేవాడిని కాదు: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)