Breaking News

IND VS ENG 4th Test: రోహిత్‌ శర్మ సరసన చేరిన రూట్‌

Published on Fri, 02/23/2024 - 16:39

రాంచీలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ ఆటగాడు జో రూట్‌ సూపర్‌ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుత భారత పర్యటనలో పేలవ ప్రదర్శనలతో ముప్పేట దాడిన ఎదుర్కొన్న రూట్‌.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి సెంచరీతో కదంతొక్కాడు. ఈ సెంచరీని రూట్‌ జట్టు కష్ట సమయం ఉన్నప్పుడు సాధించాడు. తాజా సెంచరీతో రూట్‌ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

టెస్ట్‌ల్లో రూట్‌కు ఇది 31 సెంచరీ. అన్ని ఫార్మాట్లలో ఇది 47 శతకం. ఈ సెంచరీతో రూట్‌ ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి (80) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్‌ వెటరన్‌ డేవిడ్‌ వార్నర్‌ (49 సెంచరీలు) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో (47) కలిసి రూట్‌ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (45) ఉన్నాడు. 

తాజా సెంచరీతో రూట్‌ ఫాబ్‌ ఫోర్‌ ఆటగాళ్లలో (కోహ్లి, రూట్‌, స్మిత్‌, కేన్‌) మూడో అత్యుత్తమ ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగు చేసుకున్నాడు. ఫాబ్‌ ఫోర్‌లో అత్యధిక టెస్ట్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్‌ (31)  మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో విలియమ్సన్‌ (32), స్టీవ్‌ స్మిత్‌ (32) టాప్‌లో ఉండగా.. రూట్‌, కోహ్లి (29) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

ఈ సెంచరీతో రూట్‌ మరో భారీ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌పై అత్యధిక టెస్ట్‌ సెంచరీలు (10) చేసిన ఆటగాడిగా రూట్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రూట్‌.. స్టీవ్‌ స్మిత్‌ను (9) అధిగమించాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. రాంచీ టెస్ట్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జాక్‌ క్రాలే (42), బెన్‌ డకెట్‌ (11), ఓలీ పోప్‌ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్‌ స్టోక్స్‌ (3), బెన్‌ ఫోక్స్‌(47), టామ్‌ హార్ట్లీ (13) ఔట్‌ కాగా.. రూట్‌ (106), రాబిన్సన్‌ (31) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ 3 వికెట్లతో విజృంభించగా.. సిరాజ్‌ 2, రవీంద్ర జడేజా, అశ్విన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ​్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)