చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

Published on Wed, 07/08/2026 - 12:19

టీమిండియా ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ చెత్త ప్రదర్శన కొనసాగిస్తోంది. నాటింగ్‌హామ్‌ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో శ్రేయస్‌ సేన ఇంగ్లండ్‌ చేతిలో మట్టికరిచింది.

ఇంగ్లండ్‌ భారీ స్కోరు
ఆతిథ్య ఇంగ్లండ్‌ టీమిండియాను ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. కాగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.

చతికిల పడ్డ టీమిండియా
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. టాపార్డర్‌ రెండంకెల స్కోరు చేయగా.. లోయర్‌ ఆర్డర్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (13), వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (13) పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్లుగా నిలిచారు.

ఇక ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌ సాయంతో 10 పరుగులు చేసి నిష్క్రమించాడు. జోష్‌ టంగ్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

అయితే, ఇంతటి ఫ్లాప్‌ షోలోనూ అభిషేక్‌ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌ జట్టుపై టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ చరిత్రకెక్కాడు.

ఇంగ్లండ్‌పై టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు
🏏అభిషేక్‌ శర్మ- 28
🏏హార్దిక్‌ పాండ్యా- 27
🏏విరాట్‌ కోహ్లి- 19
🏏రోహిత్‌ శర్మ- 18
🏏సూర్యకుమార్‌ యాదవ్‌ -18.

మూడో టీ20 సందర్భంగా టీమిండియా నమోదు చేసిన చెత్త రికార్డులు ఇవే
👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద ఓటమి. (125 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో చిత్తు)
👉ఇంగ్లండ్‌లో టీ20 మ్యాచ్‌లో అతి తక్కువ స్కోరుకే ఆలౌట్‌ అయిన జట్టుగా టీమిండియా (76/10).

👉ఐదు టీ20 మ్యాచ్‌లలో విజయమన్నదే లేకుండా టీమిండియా పరాజయాల పరంపర కొనసాగించడం ఇదే తొలిసారి. ఐర్లాండ్‌ చేతిలో రెండు, ఇంగ్లండ్‌ చేతిలో రెండు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా. ఇక వర్షం వల్ల ఇంగ్లండ్‌తో తొలి టీ20 రద్దు కాగా.. మొత్తంగా వరుసగా ఐదు మ్యాచ్‌లలో టీమిండియాకు గెలుపున్నదే లేకుండా పోయింది.

👉టీ20 మ్యాచ్‌లో 11.4 (అతి తక్కువ) ఓవర్లలో టీమిండియా ఆలౌట్‌ కావడం ఇదే మొదటిసారి.  

చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్‌

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)