Breaking News

Ind Vs Ban: రోహిత్‌తో పాటు అతడు కూడా అవుట్‌.. బీసీసీఐ ప్రకటన

Published on Tue, 12/20/2022 - 13:32

Bangladesh vs India, 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు కూడా టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. అతడితో పాటు పేసర్‌ నవదీప్‌ సైనీ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మంగళవారం ధ్రువీకరించింది.

రోహిత్‌ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు కూడా కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఇక నవదీప్‌ సైనీ పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు పేర్కొన్న బీసీసీఐ.. అతడు జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్లనున్నట్లు తెలిపింది.


నవదీప్‌ సైనీ

రాహుల్‌ సారథ్యంలో..
కాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. ఎడమచేతి బొటనవేలికి గాయమైనప్పటికీ బ్యాటింగ్‌ చేసిన హిట్‌మ్యాన్‌.. నొప్పి తీవ్రతరం కావడంతో స్వదేశానికి తిరిగివచ్చాడు. 

ఈ క్రమంలో మొదటి టెస్టుకు దూరమైన రోహిత్‌.. రెండో మ్యాచ్‌ నాటికి అందుబాటులోకి వస్తాడనుకున్నా అలా జరుగలేదు. ఇక కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ఫాస్ట్‌బౌలర్‌ నవదీప్‌ సైనీకి టెస్టు జట్టులో చోటు దక్కినా మొదటి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, ఛతేశ్వర్ పుజారా (వైస్‌ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), కెఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

చదవండి: Kylian Mbappe: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె
Babar Azam: ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమి.. బాబర్‌ ఆజం చెత్త రికార్డు! మొదటి పాక్‌ కెప్టెన్‌గా..

Videos

కలర్ ఫుల్ బ్యూటీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య ఎమోషనల్..

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

రేపట్నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం

Liquor Case: రాజకీయ కక్ష అని తేలితే...? సుప్రీం సీరియస్

Miss World 2025: అందం అంటే..!

మాట నిలబెట్టుకున్న జగన్.. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల చెక్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ రిప్లై

సమంత లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్?

Photos

+5

'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' హీరో క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

Subham Success Meet : శుభం సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)