Breaking News

IND VS AUS 4th Test: నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిం​డియా ముందు భారీ లక్ష్యం

Published on Sun, 12/29/2024 - 07:05

నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిం​డియా ముందు భారీ లక్ష్యం
మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్‌ 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాథన్‌ లయోన్‌ (41), స్కాట్‌ బోలాండ్‌ (10) చివరి వికెట్‌కు 50కు పైగా పరుగులు (100కు పైగా బంతులు ఎదుర్కొని) జోడించి టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్‌ 3, జడేజా ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 82, రోహిత్‌ శర్మ 3, కేఎల్‌ రాహుల్‌ 24, విరాట్‌ కోహ్లి 36, ఆకాశ్‌దీప్‌ 0, రిషబ్‌ పంత్‌ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్‌ రెడ్డి 114, వాషింగ్టన్‌ సుందర్‌ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, బోలాండ్‌, లయోన్‌ తలో 3 వికెట్లు పడగొట్టారు.

దీనికి ముందు ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్‌ కొన్‌స్టాస్‌ (60), ఉస్మాన్‌ ఖ్వాజా (57), లబూషేన్‌ (72), కమిన్స్‌ (49), అలెక్స్‌ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్‌ 2, సుందర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. స్టార్క్‌ రనౌట్‌

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
148 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న లబూషేన్‌ను (70) సిరాజ్‌ సూపర్‌ డెలివరీతో ఎల్బీడబ్ల్యూ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 253 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 

గాడిలో పడుతున్న ఆస్ట్రేలియా
లంచ్‌ తర్వాత వడివడిగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీ విరామానికి ముందు కాస్త కుదుటపడింది. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ ఆ ఆతర్వాత మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడింది. టీ విరామం సమయానికి ఆసీస్‌ స్కోర్‌ 135/6గా ఉంది. లబూషేన్‌ (65).. కమిన్స్‌తో (21) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం​ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్‌ 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

ఆరో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
91 పరుగుల వద్ద ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా అద్భుతమైన బంతితో అలెక్స్‌ క్యారీని (2) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ప్రస్తుతం ఆసీస్‌ 196 పరుగుల లీడ్‌లో ఉంది. 

బుమ్రా ఆన్‌ ఫైర్‌.. 85 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆసీస్‌
బుమ్రా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. తొలుత డేంజర్‌ మ్యాన్‌ ట్రవిస్‌ హెడ్‌ను (1) పెవిలియన్‌కు పంపిన బుమ్రా అదే ఓవర్‌ చివరి బంతికి మిచెల్‌ మార్ష్‌ను  (0) ఔట్‌ చేశాడు. మొత్తంగా ఆసీస్‌ 10 బంతుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 

జోరు మీదున్న బుమ్రా, సిరాజ్‌.. కష్టాల్లో ఆసీస్‌
భారత పేసర్లు బుమ్రా, సిరాజ్‌ జోరు మీదున్నారు. వీరి ధాటికి ఆసీస్‌ ఆరు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. స్టీవ్‌ స్మిత్‌ను (13) సిరాజ్‌.. డేంజర్‌ మ్యాన్‌ ట్రవిస్‌ హెడ్‌ను (1) బుమ్రా పెవిలియన్‌కు పంపారు. ప్రస్తుతం ఆసీస్‌ స్కోర్‌ 85/4గా ఉంది. లబూషేన్‌ (39), మిచెల్‌ మార్ష్‌ క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్‌ 190 పరుగుల ఆధిక్యంలో  ఉంది.

లంచ్‌ బ్రేక్‌.. 158 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా
రోజు లంచ్‌ విరామం సమయానికి ఆసీస్‌ స్కోర్‌ 53/2గా ఉంది. 105 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ కలుపుకుని ప్రస్తుతం ఆసీస్‌ 158 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబూషేన్‌ (20), స్టీవ్‌ స్మిత్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను 369 పరుగులకు ఆలౌట్‌ చేసిన ఆసీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కొన్‌స్టాస్‌ను బుమ్రా.. ఖ్వాజాను సిరాజ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. లబూషేన్‌ (16), స్టీవ్‌ స్మిత్‌ క్రీజ్‌లో ఉన్నారు.

భారత్‌ 369 ఆలౌట్‌
358/9 స్కోర్‌ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 11 పరుగులు జోడించి 369 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (114) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. 

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 82, రోహిత్‌ శర్మ 3, కేఎల్‌ రాహుల్‌ 24, విరాట్‌ కోహ్లి 36, ఆకాశ్‌దీప్‌ 0, రిషబ్‌ పంత్‌ 28, రవీంద్ర జడేజా 17, వాషింగ్టన్‌ సుందర్‌ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, బోలాండ్‌, లయోన్‌ తలో 3 వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్‌ కొన్‌స్టాస్‌ (60), ఉస్మాన్‌ ఖ్వాజా (57), లబూషేన్‌ (72), కమిన్స్‌ (49), అలెక్స్‌ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్‌ 2, సుందర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)