Breaking News

రోహిత్‌, శ్రేయస్‌ ఫిఫ్టీలు.. అదరగొట్టిన అక్షర్‌, హర్షిత్‌.. ఆసీస్‌ లక్ష్యం ఎంతంటే?

Published on Thu, 10/23/2025 - 12:56

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)తో పాటు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) అర్థ శతకాలతో రాణించగా.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌లో పేస్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా (Harshit Rana) అదరగొట్టారు. 

ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాతో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య పెర్త్‌లో తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో ఆడిలైడ్‌లో గురువారం నాటి రెండో వన్డేలోనూ టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది.

గిల్‌, కోహ్లి ఫెయిల్‌
ఓపెనర్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (9)తో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (0)లను వరుస బంతుల్లో ఆసీస్‌ యువ పేసర్‌ జేవియర్‌ బార్ట్‌లెట్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆదిలోనే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, నాలుగో నంబర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు.

రోహిత్‌, శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీలు
నెమ్మదిగా, నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిర్మించారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ 74 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. అయితే, మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో రోహిత్‌  పెవిలియన్‌కు చేరాడు.

వేగంగా ఆడిన అక్షర్‌, హర్షిత్‌
ఇక శ్రేయస్‌ అయ్యర్‌ 77 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు బాది 61 పరుగుల వద్ద.. ఆడం జంపా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 41 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టిన అక్షర్‌ హాఫ్‌ సెంచరీ (44)కి ఆరు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జంపా బౌలింగ్‌లో అవుటయ్యాడు.

ఇతరులలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (11), ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌ (12), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (8) విఫలం కాగా.. టెయిలెండర్‌ హర్షిత్‌ రాణా ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 18 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ 14 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేశాడు.

జంపాకు నాలుగు వికెట్లు
ఈ నేపథ్యంలో తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 264 పరుగులు సాధించి.. ఆసీస్‌కు 265 పరుగుల లక్ష్యం విధించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్‌ ఆడం జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు బార్ట్‌లెట్‌ మూడు, స్టార్క్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు. 

చదవండి: డకౌట్‌ తర్వాత కోహ్లి చర్య వైరల్‌.. గుడ్‌బై చెప్పేశాడా?
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)