Breaking News

ఆసీస్‌పై విధ్వంసకర శతకం బాదిన ప్రియాంశ్‌ ఆర్య.. తొలి మ్యాచ్‌లోనే..!

Published on Wed, 10/01/2025 - 16:07

కాన్పూర్‌ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక వన్డేలో (India A vs Australia A) భారత-ఏ జట్టు ఓపెనర్‌ ప్రియాంశ్‌ ఆర్య (Priyansh Arya) చెలరేగిపోయాడు. 82 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఆర్య మరో ఓపెనర్‌, పంజాబ్‌ కింగ్స్‌ సహచరుడు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌తో (53 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి తొలి వికెట్‌కు 123 బంతుల్లో 135 పరుగులు జోడించాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. 31.4 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 214/2గా ఉంది. ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ ఔట్‌ కాగా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (36), రియాన్‌ పరాగ్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్‌ నిన్న జరగాల్సి ఉండింది. అయితే వర్షం​ కారణంగా ఇవాల్టికి వాయిదా పడింది.

టీమిండియా దిశగా అడుగులు..
ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో మెరుపు శతకాలు బాది, ఐపీఎల్‌ ఛాన్స్‌ దక్కించుకున్న ప్రియాంశ్‌.. తన తొలి ఐపీఎల్‌ ఎడిషన్‌లోనే (2025) చెలరేగిపోయాడు. గత సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున అరంగేట్రం చేసి సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 

ఈ సీజన్‌లో ప్రియాంశ్‌ సీఎస్‌కేపై 42 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రకంపనలు సృష్టించాడు. గత సీజన్‌లో ప్రియాంశ్‌ మొత్తంగా 475 పరుగులు సాధించి, ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆసీస్‌-ఏపై సెంచరీతో ప్రియాంశ్‌ అడుగులు టీమిండియావైపు పడుతున్నాయనడంలో సందేహం లేదు.

తొలి మ్యాచ్‌లోనే..!
ప్రియాంశ్‌ భారత్‌-ఏ తరఫున ఆడటం ఇదే తొలిసారి. ఆసీస్‌-ఏతో సిరీస్‌కు అతను కేవలం తొలి మ్యాచ్‌కు మాత్రమే ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో జరుగబోయే మిగతా రెండు వన్డేలకు ప్రియాంశ్‌ స్థానాన్ని అభిషేక్‌ శర్మ భర్తీ చేస్తాడు.

కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 1-0తో చేజిక్కించుకోగా.. ప్రస్తుతం వన్డే సిరీస్‌ నడుస్తుంది. మిగతా రెండు వన్డేలు అక్టోబర్‌ 3, 5 తేదీల్లో కాన్పూర్‌ వేదికగా జరుగనున్నాయి.  

చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. సరికొత్త ప్రపంచ రికార్డు

 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?