Breaking News

IND vs AFG ODIs: ఫైనల్‌ వర్షార్పణం.. విజేత ఎవరంటే?

Published on Mon, 12/01/2025 - 13:13

బెంగళూరు: అండర్‌–19 ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌లో భారత్‌ ‘ఎ’, అఫ్గానిస్తాన్‌ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్‌ వర్షం కారణంగా రద్దు అయింది. దిత్వా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను 31 ఓవర్లకు కుదించారు. 

మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసిన దశలో వెలుతురులేమి, వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత ఎంతసేపు ఎదురుచూసినా ఆట తిరిగి ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 

కెప్టెన్‌ విఫలం
భారత బ్యాటర్లలో కనిష్క్‌ చౌహాన్‌ (28 నాటౌట్‌), అభిజ్ఞ కుందు (27) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్‌ విహాన్‌ మల్హోత్రా (10), వన్ష్‌ ఆచార్య (2), వఫీ (2), వినీత్‌ (0) విఫలమయ్యారు. అఫ్గాన్‌ బౌలర్లలో అబ్దుల్‌ అజీజ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

ఈ టోర్నమెంట్‌లో భారత్‌ ‘ఎ’, అఫ్గానిస్తాన్‌తో పాటు భారత్‌ ‘బి’ జట్టు కూడా పాల్గొంది. లీగ్‌ దశలో అఫ్గానిస్తాన్‌ 4 మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడి 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... భారత ‘ఎ’ జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో 8 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత ‘బి’ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో చివరి స్థానంలో నిలిచింది. 

చదవండి: సూర్యవంశీ మరోసారి ఫెయిల్‌.. మాత్రే వరుస సెంచరీలు

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)