Breaking News

రేపటి నుంచి క్రికెట్‌ మహా సంగ్రామం ప్రారంభం

Published on Mon, 09/29/2025 - 16:47

రేపటి నుంచి (సెప్టెంబర్‌ 30) మహిళల క్రికెట్‌ మహా సంగ్రామం (ICC Women's World Cup-2025) ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్‌ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 

నవంబర్‌ 2 వరకు జరిగే ఈ క్రికెట్‌ పండుగలో మొత్తం 8 జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక) పాల్గొంటున్నాయి. 5 వేదికలపై 34 రోజుల పాటు 31 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఇది 13వ ఎడిషన్‌.

మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి..?
భారత్‌లో: గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, నవి ముంబై  
శ్రీలంకలో: కొలంబో  
కొలంబోలో మొత్తం 10 మ్యాచ్‌లు జరుగుతాయి. పాకిస్తాన్ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లు ఇక్కడే షెడ్యూల్‌ అయ్యాయి.

మ్యాచ్ టైమింగ్స్‌..
ఒక్క మ్యాచ్‌ మినహా అన్ని మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 26న న్యూజిలాండ్ vs ఇంగ్లండ్ మ్యాచ్ మాత్రం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.

జట్ల కెప్టెన్లు.. 
భారత్‌- హర్మన్‌ప్రీత్ కౌర్
ఆస్ట్రేలియా- అలిస్సా హీలీ 
ఇంగ్లాండ్- నాట్ స్కివర్-బ్రంట్
న్యూజిలాండ్- సోఫీ డివైన్
పాకిస్తాన్- ఫాతిమా సనా
దక్షిణాఫ్రికా- లారా వోల్వార్డ్ట్
బంగ్లాదేశ్- నిగార్ సుల్తానా జోటి  
శ్రీలంక- చమారి అటపత్తు

భారత మ్యాచ్‌లు..
సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక – గౌహతి  
అక్టోబర్ 5: భారత్ vs పాకిస్తాన్ – కొలంబో  
అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా – విశాఖపట్నం  
అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ – ఇండోర్  
అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ – నవి ముంబై  
అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ – నవి ముంబై  

అక్టోబర్ 29, 30: సెమీఫైనల్స్  
నవంబర్ 2: ఫైనల్

భారత జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన (వైస్ కెప్టెన్), జెమిమా, రిచా ఘోష్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, స్నేహ్ రాణా, హర్లీన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, ఉమా చేత్రి, అమన్‌జోత్, కాంతి గౌడ్, శ్రీ చరణి, ప్రతికా రావల్  

రిజర్వ్స్: తేజల్ హసాబ్నిస్, ప్రీమా రావత్, ప్రియా మిశ్రా, మిన్ను మణి, సయాలి సత్ఘారే

ప్రసార వివరాలు.. 
మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 2025ను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. JioHotstar యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.

చదవండి: టీమిండియాకు కొత్త టాస్క్‌.. మరో మూడు రోజుల్లో ప్రారంభం

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి