టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల

Published on Tue, 01/27/2026 - 15:32

2026 టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ వైదొలగడం, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ ఎంట్రీ ఇవ్వడం వంటి గందరగోళాల మధ్య షెడ్యూల్‌ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా ఒకే ఒక మ్యాచ్‌ ఆడనుంది. ఫిబ్రవరి 4న గత ఎడిషన్‌ రన్నరప్‌ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 

ఇదే వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా భారత-ఏ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు ఆడనుండటం విశేషం. చిన్న జట్లు యూఎస్‌ఏ, నమీబియాకు ప్రాక్టీస్‌ కోసం ఈ మ్యాచ్‌లు షెడ్యూల్‌ చేయబడ్డాయి. ఫిబ్రవరి 2న భారత-ఏ జట్టు నవీ ముంబై వేదికగా యూఎస్‌ఏతో తలపడనుంది. 6న బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌లో నమీబియాను ఢీకొట్టనుంది. మొత్తంగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు 16 వార్మప్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఫిబ్రవరి 2
ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బీసీసీఐ గ్రౌండ్‌, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)
భారత్‌-ఏ వర్సెస్‌ యూఎస్‌ఏ (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)
కెనడా వర్సెస్‌ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)

ఫిబ్రవరి 3
శ్రీలంక-ఏ వర్సెస్‌ ఒమన్‌ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)
నెదర్లాండ్స్‌ వర్సెస్‌ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)
నేపాల్‌ వర్సెస్‌ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)

ఫిబ్రవరి 4
నమీబియా వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బీసీసీఐ గ్రౌండ్‌, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)
ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ (బీసీసీఐ గ్రౌండ్‌-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)
ఐర్లాండ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)
భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)

ఫిబ్రవరి 5
ఒమన్‌ వర్సెస్‌ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)
కెనడా వర్సెస్‌ నేపాల్‌ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)
ఆస్ట్రేలియా వర్సెస్‌ నెదర్లాండ్స్‌ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)
న్యూజిలాండ్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)

ఫిబ్రవరి 6
ఇటలీ వర్సెస్‌ యూఎస్‌ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)
భారత్‌-ఏ వర్సెస్‌ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్‌-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు)

ఈ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్‌ మెయిన్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్‌ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)