Breaking News

బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌.. బీసీబీ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ

Published on Wed, 01/21/2026 - 19:15

భారత్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్‌ మ్యాచ్‌ల వేదికలను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃపరిశీలనలు ఉండవని తేల్చి చెప్పింది.

ఇవాళ  (జనవరి 21) జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో ఓటింగ్‌ ద్వారా ఈమేరకు నిర్ణయించింది. మొత్తం 16 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. కేవలం ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. మిగతా సభ్యులు వ్యతిరేకించారు.

భరోసా ఇచ్చినా..!
భద్రతను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్‌ జట్టుకు ఐసీసీ పూర్తి భరోసా ఇచ్చింది. అయినా ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఓవరాక్షన్‌ చేస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో స్వతంత్ర సంస్థలు చేసిన భద్రతా అంచనాలు, వేదికల వారీగా రూపొందించిన భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశం ఇచ్చిన హామీలన్నిటినీ ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి, బంగ్లాదేశ్‌ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.

ముస్తాఫిజుర్ ఉదంతంతో సంబంధమే లేదు  
భారత్‌లో ఆడకుండా ఉండటానికి బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు చూపుతున్న సాకులకు, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతంతో సంబంధమే లేదని ఐసీసీ పేర్కొంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించడాన్ని భద్రతా సమస్యతో అనుసంధానం చేయడం సరి కాదని హితవు పలికింది.  
 
స్కాట్లాండ్‌కు అవకాశం  
ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే, వారి స్థానాన్ని స్కాట్లాండ్‌ భర్తీ చేస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో అత్యధిక ర్యాంక్ కలిగిన జట్టుగా స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌కు ఎంపికవుతుంది.

మరో 24 గంటల డెడ్‌లైన్‌
ఇది జరగకుండా ఉండాలంటే బంగ్లాదేశ్‌ మరో 24 గంటల్లో ఏ విషయం తేల్చాలని ఐసీసీ అల్టిమేటం​ జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈలోపు కూడా బంగ్లాదేశ్‌ ఏ విషయం తేల్చకపోతే డీఫాల్ట్‌గా స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.

షెడ్యూల్‌ ప్రకారం బంగ్లాదేశ్‌.. వెస్టిండీస్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి గ్రూప్‌-సిలో ఉంది. బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్‌ను ముంబైలో ఆడేలా షెడ్యూల్ ఉంది.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)