Breaking News

బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్ లైన్‌.. లేదంటే?

Published on Mon, 01/19/2026 - 12:41

టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వస్తుందా?  లేదా అన్నది? జ‌న‌వ‌రి 21న తేలిపోనుంది. భద్రత కార‌ణాల‌ను సాకుగా చూపుతూ త‌మ జ‌ట్టును వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం భార‌త్‌కు పంప‌బోమ‌ని  బంగ్లా క్రికెట్ బోర్డు మొండి ప‌ట్టుతో ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మ మ్యాచ్‌ల‌ను శ్రీలంక‌కు త‌ర‌లించాల‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు ఐసీసీకి బీసీబీ విజ్ఞప్తి చేసింది.

అందుకు సమాధానముగా ఆఖరి నిమిషంలో షెడ్యూల్‌ను మార్చడం కుదరద‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెల్చిచేప్పేసింది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

ఈ క్ర‌మంలో ఐసీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.  భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ వస్తుందా లేదా అనే విష‌యం చెప్పేందుకు జనవరి 21ని తుది గడువుగా ఐసీసీ నిర్ణయించిన‌ట్లు స‌మాచారం. ఒకవేళ బంగ్లాదేశ్ తన మొండిపట్టు వీడకుంటే.. ఆ స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చాల‌ని ఐసీసీ భావిస్తుందంట‌. ఐసీసీ ర్యాంకింగ్స్ బంగ్లాదేశ్ త‌ర్వాతి స్దానాల్లో జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి. అయితే జింబాబ్వే, ఐర్లాండ్ జ‌ట్లు ఇప్ప‌టికే ఈ మెగా టోర్నీకి అర్హ‌త సాధించ‌గా.. త‌ర్వాత స్దానంలో ఉన్న స్కాట్లాండ్‌కు బంగ్లా స్దానంలో అవ‌కాశం ద‌క్క‌నుంది.

కాగా గత కొంత‌కాలంగా బంగ్లాదేశ్‌-భార‌త్ మ‌ధ్య రాజకీయ ఉద్రిక్త‌లు నెల‌కొన్నాయి. అయితే ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుద‌ల చేయ‌డంతో ఈ ఉద్రిక్త‌లు క్రికెట్‌కు పాకాయి. బంగ్లాలో హిందువల‌పై దాడులు పెరిగిపోతుండ‌డంతో బీసీసీఐ ఆదేశాల మేర‌కు కేకేఆర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. 

దీంతో ఘోర అవ‌మానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. త‌మ జ‌ట్టును వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం భార‌త్ పంప‌బోమ‌ని, వేదిక‌ల‌ను శ్రీలంక‌కు మార్చాల‌ని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్ర‌సారాల‌ను త‌మ దేశంలో బంగ్లా ప్ర‌భుత్వం బ్యాన్ చేసింది. ఇక షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ‌ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదిక‌ల‌గా ఆడాల్సి ఉంది.
చదవండి: T20 World Cup 2026: సౌతాఫ్రికాకు భారీ షాక్

Videos

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)