Breaking News

పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌

Published on Wed, 09/10/2025 - 14:59

గత కొన్నాళ్లుగా భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైన పేరు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer). పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నా ఆసియా కప్‌-2025 ఆడే టీమిండియాలో అతడికి చోటు దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే.. 2022-23 మధ్య కాలంలో శ్రేయస్‌ ఇంతకంటే గడ్డు పరిస్థితులే ఎదుర్కొన్నాడు.

క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంతో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) శ్రేయస్‌ సెంట్రల్‌ కాంట్రాక్టును రద్దు చేసింది. అదే సమయంలో ఫిట్‌నెస్‌ సమస్యలు కూడా అతడిని వెంటాడాయి. నాటి పరిస్థితి గురించి  శ్రేయస్‌ అయ్యర్‌ తాజాగా మాట్లాడుతూ విస్మయకర విషయాలు వెల్లడించాడు.

పక్షవాతం వచ్చింది
‘‘ఆ సమయంలో నేను నొప్పితో ఎంతగా విలవిల్లాడానో ఎవరికీ తెలియదు. నా కాలుకు పక్షవాతం వచ్చింది. వెన్నెముకకు సర్జరీ జరిగిన తర్వాత.. నడుములో రాడ్డుతో ఎలా మేనేజ్‌ చేసుకున్నానో నాకే తెలియదు. ఆ ప్లేస్‌లో ఉన్న నరం కూడా దెబ్బతిన్నది.

అదెంతో ప్రమాదకరమని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో భరించలేని నొప్పి. నా కాలి చిటికిన వేలు వరకు నొప్పి పాకింది. నిజంగా అదొక భయంకర అనుభవం’’ అని జీక్యూ ఇండియాకు శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు.

కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయస్‌ అ‍య్యర్‌ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకున్నాడు. అదే విధంగా ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా టైటిల్‌ అందించాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో పునరాగమనం చేయగా.. బీసీసీఐ అతడి సెంట్రల్‌ కాంట్రాక్టును పునరుద్ధరించింది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌ భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

వాటిని మాత్రమే నియంత్రించగలను
అదే విధంగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలపడంలో ముఖ్య భూమిక అతడిదే. ఇక ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ గొప్పగా రాణించాడు. జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయినప్పటికీ ఆసియా టీ20 కప్‌ ఆడే భారత జట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవడం గమనార్హం.

ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నా ఆధీనంలో ఉన్న వాటిని మాత్రమే నేను నియంత్రించగలను. నా నైపుణ్యాలు, బలాలను మరింత మెరుగుపరచుకోవడం మాత్రమే నాకు తెలిసిన పని. అవకాశం వచ్చినప్పుడు రెండు చేతులతో దానిని అందిపుచ్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ స్పష్టం చేశాడు.

చదవండి: ‘యువీకి అప్‌గ్రేడ్‌ వర్షన్‌ అతడు.. గిల్‌కు కూడా మంచి ఛాన్స్‌’

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)