Breaking News

IND vs PAK: ‘​వర్షం పడాలని కోరుకుంటున్నా’

Published on Sun, 02/15/2026 - 10:46

క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడి భయం అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది.

వాన పడొద్దు దేవుడా!
కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో గ్రూప్‌-ఎలో ఉన్న భారత్‌- పాక్‌ మధ్య మ్యాచ్‌కు శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్‌. ప్రేమదాస స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉంది. 

అయితే, ఆదివారం కొలంబోలో వాన పడే అవకాశాలు 93 శాతం ఉన్నట్లు ఆక్యూవెదర్‌ పేర్కొంది. సాయంత్రానికి వర్షం ముప్పు తగ్గినా అవుట్‌ ఫీల్డ్‌ తడిగా ఉంటే మ్యాచ్‌ సజావుగా సాగే అవకాశాలు సన్నగిల్లుతాయి.

ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులంతా వర్షం ప్రభావం ఈ మ్యాచ్‌పై పడకుండా చూడాలంటూ దేవుడిని వేడుకుంటున్నారు. క్రేజీ మ్యాచ్‌ కోసం తామంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని.. తమ ఆశలపై నీళ్లు చల్లవద్దని వరుణుడిని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ (Basit Ali) వింత వ్యాఖ్యలు చేశాడు.

వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా
ఓ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. "ఆ సర్వాంతర్యామి (దేవుడు) నా ప్రార్థన విని వర్షం పడేలా చేయాలి’’ అని బసిత్‌ అలీ వ్యాఖ్యానించాడు. ఇందుకు హోస్ట్‌.. "మీరు మ్యాచ్‌ మొత్తం చూడాలని అనుకోవడం లేదా?" అని అడుగగా.. "నేను వర్షం పడాలని కోరుకుంటున్నాను (I Want Rain)" అని పునరుద్ఘాటించాడు.

అదే జరిగితే మ్యాచ్‌ రద్దు
కాగా వరల్డ్‌కప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ఉండదు. ఫలితం కోసం ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదీ కుదరని పక్షంలో మ్యాచ్‌ రద్దైనట్లు అంపైర్లు ప్రకటిస్తారు. ఇరుజట్లకు చెరో పాయింట్‌ కేటాయిస్తారు.

ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌.. అమెరికా, నమీబియాలపై గెలిచి నాలుగు పాయింట్లు సాధించగా.. పాకిస్తాన్‌ సైతం నెదర్లాండ్స్‌, అమెరికా జట్లను ఓడించి నాలుగు పాయింట్లతో ఉంది. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా టీమిండియా (+3.050) పాకిస్తాన్‌ (+0.932) అత్యంత మెరుగ్గా ఉండి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

ఇదేం కోరిక?
ఒకవేళ దాయాదుల పోరు వర్షం వల్ల రద్దు అయిపోతే.. భారత్‌- పాక్‌ ఐదు పాయింట్లతో సూపర్‌-8 దశకు దాదాపుగా అర్హత సాధించినట్లే. గ్రూప్‌ దశలో అమెరికా, నెదర్లాండ్స్‌లకు చెరో మ్యాచ్‌ మిగిలి ఉండగా.. నమీబియా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, నెదర్లాండ్స్‌ (-1.352), నమీబియా (-2.884) నెట్‌రన్‌రేటు మైనస్‌లలో ఉండటం గమనార్హం.

ఇక గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో అనూహ్య రీతిలో పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియాతో పాటు అమెరికా సూపర్‌-8కు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాక్‌ టోర్నీ నుంచి అవమాన భారంతో నిష్క్రమించింది. 

ఇక ఇప్పుడు భారత్‌ చేతిలో పాక్‌ గనుక భారీ తేడాతో ఓడితే మళ్లీ అమెరికాతో ప్రమాదం పొంచి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్‌- పాక్‌ మ్యాచ్‌ వాన వల్ల చెడిపోవాలని బసిత్‌ అలీ కోరుకుంటున్నాడని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

IND vs PAK T20 World Cup 2026: భారత్‌ ‘రుద్ర’ రూపం

చదవండి: IND vs PAK: పాక్‌తో భారత్‌ మ్యాచ్‌.. మధ్యాహ్నమే!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)