Breaking News

కెప్టెన్‌గా సిరాజ్‌.. ప్రత్యర్థి 134 పరుగులకే ఆలౌట్‌

Published on Sun, 10/11/2026 - 16:30

టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. దేశీ రెడ్‌బాల్‌ క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. తాజా సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌ వేదికగా సిరాజ్‌ సేన.. త్రిపురతో మ్యాచ్‌ మొదలుపెట్టింది.

బిక్రమ్‌కుమార్‌ దాస్‌ అర్ధ శతకం
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న త్రిపుర శుభారంభం అందుకుంది. ఓపెనర్లలో బిక్రమ్‌కుమార్‌ దాస్‌ అర్ధ శతకం (107 బంతుల్లో 50) బాదగా.. హ్రితురాజ్‌ రాయ్‌ (70 బంతుల్లో 33) ఫర్వాలేదనిపించాడు. అయితే, వీళ్లిద్దరు అవుటైన తర్వాత త్రిపుర బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేక మేడలా కుప్పకూలింది.

126-3 టు 134-10 
హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి తాళలేక 134 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఒక దశలో 126 పరుగులకు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన త్రిపుర.. మరో ఎనిమిది పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేయడం గమనార్హం. 

శ్రీదం పాల్‌, హనుమ విహారి, సెంతు సర్కార్‌, సందీప్‌ సర్కార్‌, పర్వేజ్‌ సుల్తాన్‌ డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ మణిశంకర్‌ మురాసింగ్‌, రజత్‌ డే, అభిజిత్‌ కె సర్కార్‌ ఒక్కో పరుగు చేశారు. మందీప్‌ సింగ్‌ 24 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

హైదరాబాద్‌ బౌలర్లలో స్పిన్నర్లు అనికేత్‌ రెడ్డి ఐదు వికెట్లతో అద్భుతం చేయగా.. తనయ్‌ త్యాగరాజన్‌ మూడు వికెట్లతో మెరిశాడు. రుతిక్‌ యాదవ్‌ మెండేకు ఒక వికెట్‌ దక్కింది. కెప్టెన్‌ సిరాజ్‌ తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో 25 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

చదవండి: సౌతాఫ్రికాతో టెస్టు.. ఆసీస్‌ బౌలర్‌ ప్రపంచ రికార్డు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)