మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్‌ గిల్‌: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Published on Fri, 06/19/2026 - 14:15

టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలో టాపార్డర్‌లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

తొలుత ధర్మశాలలో అఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ ఖాతాలో తొలి సిరీస్‌ విజయం చేరింది.

ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్‌ జోడీని మార్చింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు బదులు.. యశస్వి జైస్వాల్‌ రోహిత్‌ శర్మతో పాటు ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.

మరోవైపు.. రోహిత్‌ 48 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన గిల్‌ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్‌ కిషన్‌.. ఈసారి నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్‌ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.

క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్‌ శర్మతో యశస్వి జైస్వాల్‌ను ఓపెనింగ్‌ చేయించి శుబ్‌మన్‌ గిల్‌ను వన్‌డౌన్‌కి డిమోట్‌ చేశారు. ఆ స్థానంలో గిల్‌ భారీగా పరుగులు రాబట్టాడు.

ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్‌గా వెళ్లాలా? లేదంటే వన్‌డౌన్‌లోనే ఆడాలా అని గిల్‌ కన్ఫ్యూజ్‌ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.

ఏదేమైనా జైస్వాల్‌ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్‌ శర్మ అఫ్గన్‌తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్‌ తివారి చెప్పుకొచ్చాడు.

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)