Breaking News

స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

Published on Tue, 11/25/2025 - 12:19

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం ఊహించని పరిణామంతో వాయిదా పడింది. ప్రియుడు, బాలీవుడ్‌ సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేళ.. ఆమె తండ్రి శ్రీనివాస్‌ మంధాన అనారోగ్యం పాలయ్యారు. గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

స్మృతి- పలాష్‌ పెళ్లి నిరవధికంగా వాయిదా
ఈ నేపథ్యంలో తండ్రి చూడని వేడుక తనకు వద్దంటూ స్మృతి.. పలాష్‌తో పెళ్లిని వాయిదా వేసుకుందని ఆమె మేనేజర్‌ మీడియాకు చెప్పారు. ఓవైపు తండ్రి విషయంలో స్మృతి ఆందోళన చెందుతుండగా.. మరోవైపు.. ఆమెకు కాబోయే భర్త పలాష్‌ ముచ్చల్‌ కూడా ఆస్పత్రిపాలయ్యాడు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఎసిడిటీతో అతడు ముంబైలోని గోరేగావ్‌ ఆస్పత్రిలో చేరాడు.

వరుస మ్యూజిక్‌ కన్సర్టులు, పెళ్లి పనుల కారణంగానే పలాష్‌ ముచ్చల్‌ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని.. అందుకే అతడి ఆరోగ్యం చెడిపోయిందని ఎన్‌డీటీవీకి అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, స్మృతి- పలాష్‌ పెళ్లి నిరవధికంగా వాయిదా పడటంపై సోషల్‌ మీడియాలో ఊహించని విధంగా వదంతులు పుట్టుకువచ్చాయి. ఇరు కుటుంబాల మధ్య సఖ్యత చెడిందా అనేలా గాసిప్‌రాయుళ్లు పుకార్లు పుట్టిస్తున్నారు.

స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు
ఈ నేపథ్యంలో పలాష్‌ ముచ్చల్‌ తల్లి అమిత.. ట్రోల్స్‌కు దిమ్మతిగిరేలా కౌంటర్‌ ఇచ్చారు. హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘స్మృతి తండ్రి అంటే పలాష్‌కు ఎంతో ఇష్టం. స్మృతి కంటే ఆమె తండ్రి దగ్గరే పలాష్‌కు సాన్నిహిత్యం ఎక్కువ.

ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే.. స్మృతి కంటే ముందు పలాష్‌ స్పందించాడు. తనే పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. స్మృతి తండ్రి కోలుకునేంత వరకు వివాహ వేడుకను వాయిదా వేయాలని చెప్పాడు. 

తీవ్రమైన ఒత్తిడి
హల్దీ తర్వాత పలాష్‌ను బయటకు ఎక్కడికీ పంపలేదు. స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి వచ్చిందని తెలియగానే పలాష్‌ చాలా సేపు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కూడా పాడైంది. ఆస్పత్రిలోనే నాలుగు గంటల సేపు ఉంచారు. ఐవీ డ్రిప్‌ పెట్టారు. ఈసీజీ తీశారు. ఇతరత్రా పరీక్షలు కూడా చేశారు. అన్ని రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయి.

అయితే, ఇప్పటికీ ఒత్తిడి నుంచి బయటపడలేకపోతున్నాడు’’ అని పలాష్‌ ముచ్చల్‌ తల్లి అమితా ముచ్చల్‌ తెలిపారు. కాగా పలాష్‌ అక్క, బాలీవుడ్‌ సింగర్‌ పాలక్‌ ముచ్చల్‌ కూడా తన సోదరుడి వివాహం గురించి స్పందించారు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగానే పెళ్లి వాయిదా పడిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు. 

చదవండి: పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్‌ కీలక వ్యాఖ్యలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)