Breaking News

‘రుతురాజ్‌ అద్భుతమైన ఆటగాడు.. ఛాన్సులు ఇస్తాం’

Published on Sat, 11/29/2025 - 17:01

ప్రతిభ ఉన్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు పొందలేకపోతున్న టీమిండియా ఆటగాళ్లలో రుతురాజ్‌ గైక్వాడ్‌ ఒకడు. ఈ మహారాష్ట్ర ఆటగాడు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటడంతో పాటు.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. టీమిండియా ఓపెనర్‌గానూ తనను తాను నిరూపించుకున్న రుతు.. ఆసియా క్రీడలు-2023లో భారత జట్టు కెప్టెన్‌గా పసిడి పతకం గెలిచాడు.

రెండేళ్ల తర్వాత..
అయితే, అనుకున్న స్థాయిలో రుతుకు టీమిండియాలో ఛాన్సులు మాత్రం రావడం లేదు. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ (Rohit Sharma), శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ల నుంచి ఎదురైన పోటీలో రుతు వెనుకబడిపోయాడు. ఈ క్రమంలో మరోసారి దేశీ క్రికెట్‌, భారత్‌-‘ఎ’ తరఫున అదరగొట్టి.. టీమిండియా పునరాగమనానికి రుతురాజ్‌ సిద్ధమయ్యాడు.

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ సందర్భంగా రుతురాజ్‌ గైక్వాడ్‌ను సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఈసారి, కెప్టెన్‌ హోదాలో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ గాయం వల్ల దూరం అయినా.. అతడికి బ్యాకప్‌గా టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌ వన్డే జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు.. ఓపెనింగ్‌ జోడీగా జైసూ, రుతులలో ఎవరు ఉంటారనేది ఆసక్తిగా మారింది.

రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతమైన ఆటగాడు
ఈ విషయంపై టీమిండియా వన్డే తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ స్పందించాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతమైన ఆటగాడు. ప్రస్తుతం మా వన్డే జట్టులో 5-6 స్థానాల్లో ఆటగాళ్లు ఫిక్సయిపోయారు.

అయితే, తనకు వచ్చిన అవకాశాలన్నిటిని రుతురాజ్‌ సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ఈ సిరీస్‌లో అతడికి ఛాన్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు. అయితే, ఏ స్థానంలో రుతురాజ్‌ను ఆడించే అవకాశం ఉందన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా ఆదివారం భారత్‌- సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇందుకు రాంచీ వేదిక.

చదవండి: అభిషేక్‌ శర్మ అట్టర్‌ఫ్లాప్‌.. సంజూ శాంసన్‌ ఫెయిల్‌

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు