T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్‌ స్టార్‌

Published on Fri, 03/06/2026 - 21:52

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ టైటిల్‌ పోరుకు న్యూజిలాండ్‌,  టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.

ఈ నేపథ్యంలో భారత్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్‌ బౌలర్‌ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.

ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో
కాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.

దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్‌ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్‌ ఫిలిప్స్‌ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్‌ అని అన్నాడు.

అతడు కూడా మనిషే కదా!
‘‘ఇటీవల టీమిండియా సిరీస్‌లో భాగంగా బుమ్రా బౌలింగ్‌లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్‌ బౌలర్‌. వైవిధ్యభరితంగా బౌలింగ్‌ చేస్తాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్‌లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.

బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. ఆరోజు అతడు విఫలం అవుతాడు. అదే, అతడి మీద మాకు మంచి రోజు అవుతుంది. ఫైనలే ఆరోజు కావాలని ఆశిస్తున్నాం?’’ అని గ్లెన్‌ ఫిలిప్స్‌ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు. 

కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్‌ కివీస్‌తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్‌లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.

చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)