Breaking News

అతడొక అద్భుతం.. కానీ: పాక్‌ మాజీ క్రికెటర్‌ యూటర్న్‌

Published on Mon, 02/23/2026 - 18:44

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. కెరీర్‌లో తొలిసారి వరల్డ్‌కప్‌ ఈవెంట్లో ఆడుతున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

హ్యాట్రిక్‌ డకౌట్లు
లీగ్‌ దశలో అమెరికా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లతో ఆడిన మ్యాచ్‌లలో అభిషేక్‌ శర్మ డకౌట్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ అభిషేక్‌ బ్యాటింగ్‌ శైలిని విమర్శించాడు. కేవలం పవర్‌ హిట్టింగ్‌పైనే ఆధారపడతాడని.. అతడి టెక్నిక్‌ సరిగ్గా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా అతడిని ‘స్లాగర్‌’గా అభివర్ణించాడు.

పరుగులు చేయాలనే తొందరలో వికెట్‌ పారేసుకుంటున్నాడని.. టెక్నిక్‌తో ఆడటం అతడికి చేతకాదని ఆమిర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీమిండియా అభిమానులు అతడిపై ఫైర్‌ అయ్యారు. అభిషేక్‌ శర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌ అని.. ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమంటూ భారత ఆటగాడికి మద్దతుగా నిలిచారు.

మరోసారి విఫలం
ఇక సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లోనూ అభిషేక్‌ శర్మ విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి పోరులో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. 12 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 15 పరుగులు చేశాడు. మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో కార్బిన్‌ బాష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

ఆమిర్‌ యూటర్న్‌!
ఈ నేపథ్యంలో మహ్మద్‌ ఆమిర్‌ మరోసారి అభిషేక్‌ శర్మ గురించి వ్యాఖ్యలు చేశాడు. తన మాటలను అందరూ అపార్థం చేసుకున్నారంటూ యూటర్న్‌ తీసుకున్నాడు. ‘‘బౌలర్‌ వైపు నుంచి నేను అభిషేక్‌ శర్మ ఆటను విమర్శించాను. అతడి టెక్నిక్‌ గురించి మాత్రమే నేను మాట్లాడాను.

కానీ నేను స్లాగర్‌ అన్న పదం వాడటం చాలా మందికి నచ్చలేదు. పటిష్ట జట్టు, బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కాస్త ఓపికగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే అభిషేక్‌ శర్మ బలహీనత ఏమిటో అందరికీ తెలిసిపోయింది. వాళ్లు అతడిని ఈజీగా ట్రాప్‌ చేయగలరు.

అద్భుతమైన నైపుణ్యాలు.. కానీ
తాజా మ్యాచ్‌లో అతడు పద్నాలుగు పరుగులను ఒకే వైపు నుంచి రాబట్టాడు. అవి కూడా చెత్త బంతుల ద్వారా వచ్చిన పరుగులే. రబడ బౌలింగ్‌ మొదలుపెట్టాగానే.. అభిషేక్‌ శర్మ తెల్లముఖం వేశాడు.

సీనియర్‌ ఆటగాడిగా నేను అభిషేక్‌ శర్మకు ఓ సలహా ఇస్తున్నా. నీ టెక్నిక్‌ గురించి ప్రత్యర్థులకు తెలిసిపోయింది. కాస్త ఓపికగా ఉండి.. బంతి ఎలా వస్తుందో అర్థం చేసుకుని ఆడితే నువ్వు మళ్లీ మునుపటిలా విజృంభించగలవు.

అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని అతడు ఎలా ఉపయోగించుకుంటాడన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఇదే. కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని మహ్మద్‌ ఆమిర్‌ చెప్పుకొచ్చాడు. 

చదవండి: కెప్టెన్‌, హెడ్‌కోచ్‌ ఏం చేస్తున్నారు?.. భారత మాజీ క్రికెటర్‌ ఆగ్రహం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)