నీకసలు బుద్ధి ఉందా?.. కుల్దీప్‌పై హార్దిక్‌, సూర్య ఫైర్

Published on Mon, 02/16/2026 - 09:47

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. గ్రూప్‌-ఎలో తొలుత అమెరికా.. తర్వాత నమీబియాలను ఓడించిన భారత్‌.. మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చిత్తు చేసింది. దాయాదిపై ఏకంగా 61 పరుగుల తేడాతో నెగ్గి సూపర్‌-8 దశకు అర్హత సాధించింది.

తటస్థ వేదికైన కొలంబోలో ఆదివారం నాటి మ్యాచ్‌లో సూర్య సేన ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. టాస్‌ ఓడి తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసిన టీమిండియా.. పాక్‌ను 114 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

మొదలుపెట్టి.. తానే ముగించాడు
భారత బ్యాటర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 77) అదరగొట్టగా.. బౌలర్లు సమిష్టిగా రాణించారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో వికెట్ల వేట మొదలుపెట్టిన హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)నే.. చివరి వికెట్‌ కూల్చి విజయంతో ముగించాడు. 

పాక్‌ ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (0)ను వచ్చీరాగానే వెనక్కి పంపిన హార్దిక్‌.. ఆఖరిగా ఉస్మాన్‌ తారిఖ్‌ (0)ను పెవిలియన్‌కు పంపి టీమిండియాను గెలుపును ఖరారు చేశాడు.

క్యాచ్‌లు డ్రాప్‌ చేసిన ఇషాన్‌, కుల్దీప్‌  
ఈ క్రమంలో టీమిండియా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)పై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌ అయ్యాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో పదిహేడో ఓవర్లో పాండ్యా బౌలింగ్‌కు దిగగా.. తొలి బంతి వైడ్‌ అయింది. అనంతరం షాహిన్‌ ఆఫ్రిది (Shaheen Afridi) ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్‌ డ్రాప్‌ చేశాడు.

దీంతో లైఫ్‌ పొందిన ఆఫ్రిది.. హార్దిక్‌ బౌలింగ్‌లో రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. నిజానికి లాంగాన్‌ వద్ద ఫీల్డింగ్‌ పొజిషన్‌లో ఉన్న కుల్దీప్‌ దానిని జారవిడిచాడు. చేతుల్లో పడిన బంతిని డ్రాప్‌ చేశాడు. దీంతో హార్దిక్‌ పాండ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మీకసలు బుద్ధి ఉందా?
ఇషాన్‌తో పాటు కుల్దీప్‌ వైపు చూపిస్తూ.. ‘ఏం జరిగినా మీ ఇద్దరే కారణం.. మీకసలు బుద్ధి ఉందా?’ అన్నట్లుగా ఫైర్‌ అయ్యాడు. ఇక ఆ ఓవర్లో ఐదో బంతికి ఆఫ్రిది ఒక పరుగు తీయగా.. ఆఖరి బంతికి పాండ్యా తారిఖ్‌ను బౌల్డ్‌ చేయడంతో పాక్‌ కథ ముగిసిపోయింది. టీమిండియా విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

సూర్య సైతం
ఇక విజయానంతరం కరచాలనం చేసుకునే సమయంలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం కుల్దీప్‌ యాదవ్‌ను గట్టిగానే మందలించాడు. ఈ చైనామన్‌ స్పిన్నర్‌ సులువైన క్యాచ్‌ను వదిలేశాడన్న కోపంతో సూర్య.. అతడిని చులకన చేసి మాట్లాడినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

కాగా పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ చెరో వికెట్‌ పడగొట్టారు. పాక్‌ బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 44 పరుగులతో టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: IND vs PAK: తిల‌క్ వ‌ర్మ‌పై గంభీర్ సీరియ‌స్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)