Breaking News

‘తండ్రి కోసం కుర్తా కొనలేని వాడు.. ‘బాబా’ కేమో రూ. 15 లక్షల గిఫ్ట్‌!’

Published on Fri, 10/17/2025 - 14:54

టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి, కోచ్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌ ((Yograj Singh) ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడికి తండ్రి కంటే.. ఓ ‘బాబా’నే ఎక్కువైపోయాడన్నాడు. 

తన మాజీ భార్య షబ్నమ్‌ (Shabnam)కు భర్త కంటే ‘బాబా’కు సేవ చేయడం అంటేనే ఎక్కువ ఇష్టం అని పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడాది కాలం భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన యోగ్‌రాజ్‌ సింగ్‌ విజయవంతమైన క్రికెటర్‌ కాలేకపోయాడు.

యువీ తల్లితో విడాకులు
అయితే, తన కలను కుమారుడి ద్వారా నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh)ను చిన్ననాటి నుంచే కఠినంగా శ్రమించేలా చేశాడు. ఈ క్రమంలో కుమారుడితో పాటు భార్య షబ్నమ్‌కు కూడా దూరమయ్యాడు. తన పితృస్వామ్య భావజాలం కారణంగా షబ్నమ్‌తో పెళ్లి పెటాకులై విడాకులకు దారి తీసింది.

ఆ తర్వాత నీనా బుంధేల్‌ అనే నటిని పెళ్లి చేసుకున్న యోగ్‌రాజ్‌ సింగ్‌కు ఆమె ద్వారా ఓ కుమార్తె, కుమారుడు కలిగారు. ఇక షబ్నమ్‌ ద్వారా అతడికి యువరాజ్‌ సింగ్‌, జొరావర్‌ జన్మించారు. అయితే, తన మొండిపట్టుదల కారణంగానే యువీ, అతడి తల్లి షబ్నమ్‌ తనను విడిచిపెట్టి వెళ్లిపోయారని.. వీలైతే తనను క్షమించాలంటూ ఇటీవల యోగ్‌రాజ్‌ వేడుకున్నాడు.

నేనొక పాపిని
అయితే, తాజా ఇంటర్వ్యూలో మరోసారి యువీ, షబ్నమ్‌లను ఉద్దేశించి యోగ్‌రాజ్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశాడు. అన్‌టోల్డ్‌ పంజాబ్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేనొక పాపిని. నా జీవితంలో చాలా తప్పులు చేశాను. ఆ దేవుడే నన్ను అన్ని విషయాల్లో శిక్షితుడిని చేశాడని భావించా.

నేను దేవుడిని నమ్ముతాను. జేబులో కేవలం ఐదు రూపాయలే ఉన్నపుడు నాకు రూ. 5 లక్షల సినిమా ఆఫర్‌ వచ్చింది. భాగ్‌ మిల్కా భాగ్‌లో నన్ను ఓ పాత్ర కోసం సంప్రదించారు.

Yuvraj Singh Father Yograj Says Warned Daughter About Family Honour

భర్త కంటే బాబానే ఎక్కువ
నా దృష్టిలో గురు గ్రంథ్‌ సాహిబ్‌ కంటే మించినది ఏదీ లేదు. హన్సాలీ వాలే బాబా వంటి నాయకులను నేను నమ్మను. వీరిలో కొందరు నిజంగానే మంచివారై ఉండవచ్చు. కానీ భర్త పాదాలు ఒత్తడాన్ని నామూషీగా భావించేవాళ్లు.. భర్త కోసం వండిపెట్టలేని వారు.. ఇలాంటి బాబాల కోసం మాత్రం భోజనం వండటంతో పాటు సేవలు చేయడానికి సిద్ధమైపోతారు.

అందరినీ ఉద్దేశించి అంటున్న మాట ఇది. కేవలం నా ఇంట్లోనే ఇలా జరిగిందని చెప్పను’’ అని పరోక్షంగా షబ్నమ్‌ గురించి యోగ్‌రాజ్‌ సింగ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

తండ్రి కోసం కుర్తా కొనలేని వాడు.. ‘బాబా’ కేమో రూ. 15 లక్షల గిఫ్ట్‌!
అదే విధంగా..  ‘‘తండ్రిగా రక్తం పంచి.. చెమట చిందిస్తూ కష్టనష్టాలకోర్చి పెంచి పెద్ద చేసి.. కన్నీళ్లు దిగమింగుకుంటూ నిన్ను ఉన్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తి కంటే నీకు బాబా ఎక్కువైపోయాడా?

కుటుంబాన్ని పోషిస్తూ.. పిల్లల ఎదుగుదల కోసం సర్వస్వం ధారబోసిన వ్యక్తి.. తనకంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని వ్యక్తి.. అలాంటి నీ తండ్రి కోసం కనీసం ఒక్క కుర్తా- పైజామా కొనలేవు. కానీ బాబాకు రూ. 15 లక్షల వాచ్‌ బహుమతిగా ఇస్తావా?

నాకోసం ఇల్లు కొంటానని ఎవరూ ఎలాంటి ఆఫర్‌ ఇవ్వలేదు. వీళ్లేం బంధువులు? వీళ్లేం పిల్లలు’’ అంటూ యువీని ఉద్దేశించి యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆరోపణలు చేశాడు. కాగా క్రికెట్‌ కోచ్‌గా ఉంటూనే..నటుడిగా మారిన యోగ్‌రాజ్‌ సింగ్‌ ఇప్పటికి 200కు పైగా సినిమాల్లో నటించాడు. 

చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే!

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)