Breaking News

గంభీర్‌, సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే!

Published on Fri, 12/12/2025 - 18:59

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించలేకపోయింది. ముల్లన్‌పూర్‌ వేదికగా రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగం చేయగా.. అది కాస్తా బెడిసికొట్టింది.

ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (0) గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను పంపించింది మేనేజ్‌మెంట్‌. సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అక్షర్‌ 21 బంతుల్లో 21 పరుగులు చేసి నిష్క్రమించాడు.

మరోవైపు.. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (17)తో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) దారుణంగా విఫలమయ్యాడు. మిగిలిన వారిలో హార్దిక్‌ పాండ్యా (20), జితేశ్‌ శర్మ (17 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు. అయితే, సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 162 పరుగులకే టీమిండియా కుప్పకూలడంతో పరాజయం ఖరారైంది.

ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుల గురించి ప్రస్తావిస్తూ సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌.. టీమిండియా నాయకత్వ బృందాన్ని విమర్శించాడు. ‘‘అక్షర్‌ మీ జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడై ఉండవచ్చు. కానీ ఇలాటి భారీ ఛేదన సమయంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?

నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్‌లో మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అక్షర్‌ బ్యాటింగ్‌ చేయగలడు. కానీ అతడిని ముందు తోసి చిక్కుల్లో పడేయడం సరికాదు. ఒకవేళ గిల్‌ కంటే ముందు అభిషేక్‌ శర్మ అవుటై ఉంటే.. లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ కోసం అక్షర్‌ను పంపించారనుకోవచ్చు.

కానీ ఇక్కడ అలా జరుగలేదు. అభిషేక్‌తో పాటు మరో లెఫ్టాండర్‌ అక్షర్‌ను పంపారు. ఏం చేస్తున్నారో అర్థమే కాలేదు. ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’’ అని హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ల తీరును స్టెయిన్‌ తప్పుబట్టాడు.

కాగా సిరీస్‌ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ.. తమ జట్టులో ఓపెనింగ్‌ జోడీ మాత్రమే ఫిక్స్‌డ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. మిగతా వారంతా ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. తమ వ్యూహాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

అయితే, టీ20 ఓపెనర్‌గా గిల్‌ను పంపడం కోసం.. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌పై వేటు వేశారు. కానీ టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి గిల్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కటక్‌ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో భారీ విజయం సాధించింది. తాజా మ్యాచ్‌లో సఫారీలు గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేశారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)