Breaking News

జైస్వాల్‌పై గంభీర్‌ ఆగ్రహం!.. ‘వేటు’ తప్పదన్న డష్కాటే!

Published on Tue, 07/01/2025 - 15:22

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి ఫీల్డింగ్‌ వైఫల్యం. కీలక సమయాల్లో కీలక క్యాచ్‌లు నేలపాలు చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు దాదాపు ఆరుసార్లు మనోళ్లు ‘లైఫ్‌’ ఇచ్చారు. అందుకు బదులుగా ఓటమి రూపంలో భారీ మూల్యమే చెల్లించారు.

ఇక ఫీల్డర్ల తప్పిదాలు గమనిస్తే ప్రధాన దోషిగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) పేరు చెప్పవచ్చు. ఆరింటిలో నాలుగు క్యాచ్‌లు అతడే జారవిడిచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ వీరుడు, గెలుపునకు పునాది వేసిన బెన్‌ డకెట్‌ ఇచ్చిన క్యాచ్‌ను జైసూ వదిలేయడం తీవ్ర ప్రభావం చూపింది.

జైస్వాల్‌ ఫీల్డింగ్‌ తీరుపై గంభీర్‌ ఆగ్రహం
ఈ నేపథ్యంలో జైస్వాల్‌ ఫీల్డింగ్‌ తీరుపై హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేయించిన గౌతీ.. ఈ సందర్భంగా గట్టిగానే క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఫీల్డింగ్‌ విషయంలో జైసూని డిమోట్‌ చేయాలని నిర్ణయించినట్లు రెవ్‌స్పోర్ట్స్‌ పేర్కొంది.

టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ డష్కాటే సోమవారం నాటి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని దాదాపు ధ్రువీకరించింది. ‘‘క్యాచింగ్‌ విభాగం మరింత దృఢంగా మారాలి. ఇంగ్లండ్‌లో కనీసం నాలుగు ప్రధాన క్యాచర్లు ఒక్కోసారి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

విరామం అనివార్యం
యశస్వి కూడా మంచి క్యాచర్‌. ఇక ఇద్దరు స్పిన్నర్లను ఆడించినప్పుడు షార్ట్‌ లెగ్‌ ఫీల్డింగ్‌ స్థానం మరింత కీలకమవుతుందని చెప్తారు. అందుకే అక్కడ మేము ఒకరి కంటే ఎక్కువ మందిని సెట్‌ చేయాలని భావిస్తున్నాం.

ఏదేమైనా యశస్వికి గల్లీ క్యాచ్‌ పాయింట్‌ నుంచి కాస్త విరామం ఇవ్వడం అవసరమే. ప్రస్తుతం అతడి ఫీల్డింగ్‌ తీరు బాగాలేదు. అయినా సరే అతడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే ఈ బ్రేక్‌ ఇవ్వాలి’’ అంటూ స్లిప్‌ క్యాచింగ్‌ రోల్‌ నుంచి జైసూను తప్పిస్తామని డష్కాటే చెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సెంచరీ (101)తో అదరగొట్టాడు.

కాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు (జూలై 2-6) బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలో జరుగనుంది.

చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. భార‌త తుది జ‌ట్టులోకి త‌మిళ‌నాడు కుర్రాడు?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)