Breaking News

ఫిఫా ఫైనల్ ఆఖ‌రిదా?.. రిటైర్మెంట్‌పై మెస్సీ స్పందన!

Published on Sat, 07/18/2026 - 18:34

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 త‌ర్వాత అర్జెంటీనా స్టార్ లియోన‌ల్ మెస్సీ త‌న అంత‌ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్నాడా? ఆదివారం స్పెయిన్‌తో జ‌రగ‌నున్న ఫిఫా ఫైన‌ల్ మెస్సీ కెరీర్‌లో చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్ అని ప్ర‌చారం న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే లియోన‌ల్ మెస్సీ త‌న రిటైర్మెంట్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 

ఇంగ్లండ్‌తో సెమీఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత ప్రెస్‌మీట్‌కు హాజ‌రైన మెస్సీకి త‌న రిటైర్మెంట్‌పై ఒక ప్ర‌శ్న ఎదురైంది. అదేంటంటే.. ‘మీ జ‌ర్నీ ఒక వీడియో గేమ్‌లా ఉంది. ఫిఫా ఫైన‌ల్ మీకు చివ‌రిది కానుందా’ అని ప్ర‌శ్నించారు. దీనిపై మెస్సీ స్పందిస్తూ.. ‘నేను నా చివ‌రి మ్యాచ్‌ను గ‌త వ‌ర‌ల్డ్‌క‌ప్‌ (ఖ‌తార్ 2022)లోనే ఆడేశాను. అక్క‌డ ఫిఫా టైటిల్ గెల‌వ‌డంతోనే నా కెరీర్‌లో అత్యున్న‌త శిఖ‌రాన్ని అధిరోహించాను. ఇప్పుడు నా ఆట ముగిసిపోయింది’అని అర్ధంకాని రీతిలో జ‌వాబివ్వ‌డంతో రిపోర్టర్లు తలలు పట్టుకోవడం గమ‌నార్హం. 

దీంతో మెస్సీ రిటైర్మెంట్‌పై మ‌రోసారి గంద‌ర‌గోళం నెల‌కొంది. అయితే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత మెస్సీ ఆట‌కు వీడ్కోలు ప‌లుకుతాడా లేదా అన్న‌ది ఆదివార‌మే తేల‌నుంది. ఇదే విష‌య‌మై అర్జెంటీనా జ‌ట్టు కోచ్‌, మేనేజ‌ర్ లియోన‌ల్ స్క‌లోనిని ​కూడా అడిగారు.ఆయ‌న కూడా ‘నాకైతే ఏ సమాచారం లేదు. నిజాయితీగా చెప్పాలంటే మెస్సీ త‌న నిర్ణ‌యంతో మ‌మ్మ‌ల్ని స‌ర్‌ప్రైజ్ చేయొచ్చు.. చేయ‌క‌పోవ‌చ్చు. రిటైర్మెంట్ అంశం పూర్తిగా అత‌డికే వ‌దిలేశాం’ అని తెలివిగా స‌మాధానం చెప్పుకొచ్చారు. 

ఇక ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో మెస్సీ అత్యున్న‌త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లోనే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకెళ్తున్నాడు. అయితే ఫ్రాన్స్ సూప‌ర్‌స్టార్  కైలియ‌న్ ఎంబాపె (7 మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌, 3 అసిస్ట్‌లు) మెస్సీతో స‌మానంగా ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైన‌ల్లో మెస్సీ గోల్ చేస్తే గోల్డెన్ బూట్ అత‌డి సొంత‌మ‌వుతుంది. 

ఒక‌వేళ మెస్సీ గోల్ చేయ‌కుంటే ఎంబాపెకు గోల్డెన్ బూట్ ద‌క్కే అవ‌కాశ‌ముంది. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న మెస్సీ ఓవ‌రాల్‌గా 21 గోల్స్‌తో ఫిఫాలో అత్య‌ధిక గోల్స్ చేసిన ఆట‌గాళ్ల జాబితాలోనూ నంబ‌ర్‌వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. మెస్సీ వెనుకే ఎంబాపె (ఫ్రాన్స్‌, 20 గోల్స్‌) రెండో స్థానంలో ఉన్నాడు.

 

Read: ఫిఫా ఫైనల్‌ మ్యాచ్‌.. ఒక్క టికెట్ ధ‌ర 27 ల‌క్ష‌లు!

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)