Breaking News

పాక్‌ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్‌ కరెక్ట్‌!

Published on Mon, 09/15/2025 - 09:26

ఆసియా కప్‌-2025 (Asia Cup) టోర్నమెంట్లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను ఓడించిన సూర్య సేన..  ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. దుబాయ్‌ వేదికగా ఏడు వికెట్ల తేడాతో సల్మాన్‌ ఆఘా బృందాన్ని ఓడించి.. చిరకాల ప్రత్యర్థిపై తమదే పైచేయి అని మరోసారి నిరూపించింది.

కాగా పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట ఉగ్రమూకలకు గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత కూడా క్రీడల్లోనూ పాక్‌తో ఎలాంటి సంబంధాలు ఉండకూడదనే డిమాండ్లు వచ్చాయి. అయితే, బహుళ దేశాలు ఆడుతున్న ఆసియా కప్‌ టోర్నీలో మాత్రం దాయాదితో ఆడేందుకు కేంద్ర అనుమతినివ్వగా.. ఆదివారం మ్యాచ్‌ జరిగింది.

నో షేక్‌హ్యాండ్‌!
స్థాయికి తగ్గట్లుగానే టీమిండియా మరోసారి రాణించి పాక్‌పై ఘన విజయం సాధించింది. అయితే, సాధారణంగా టాస్‌ వేసినపుడు, ఆట ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆటగాళ్లు కనీసం ఒక్క చిరునవ్వు గానీ.. షేక్‌హ్యాండ్‌ గానీ లేకుండానే వెనుదిరిగారు.

ముఖం మీదే తలుపు వేశారు!
ఆ తర్వాత పాక్‌ ఆటగాళ్లు ఇండియన్‌ డ్రెసింగ్‌ రూమ్‌ వైపునకు రాగా.. సిబ్బంది వారి ముఖం మీదే తలుపు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘షేక్‌హ్యాండ్‌’ ఇవ్వకపోవడంపై భారత జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పందించాడు.

క్రీడాస్ఫూర్తికి మించినవి కూడా ఉంటాయి
‘‘ముందుగానే ఈ విషయం గురించి నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడికి కేవలం మ్యాచ్‌ ఆడేందుకు మాత్రమే మేము వచ్చాము. వారికి సరైన విధంగా బదులిచ్చాము. కొన్ని విషయాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయి. 

ఈ విజయం ఆపరేషన్‌ సిందూర్‌లో ధైర్యసాహసాలు చూపిన భారత ఆర్మీకి అంకితం. పహల్గామ్‌ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా మద్దతుగా ఉంటాము’’ అని సూర్య చెప్పాడు.

అలాంటివాళ్లకు గంభీర్‌ కరెక్ట్‌!
కాగా టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ నిర్ణయానుగుణంగానే భారత ఆటగాళ్లు పాక్‌ ప్లేయర్లతో షేక్‌ హ్యాండ్‌కు నిరాకరించినట్లు ‘టెలికామ్‌ ఆసియా స్పోర్ట్‌’ పేర్కొంది. అంతేకాదు మైదానంలోనూ వారితో ఒక్క మాట కూడా మాట్లాడవద్దని గౌతీ ముందుగానే హెచ్చరించినట్లు తెలిపింది. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్‌కు సరైన విధంగా బుద్ధిచెప్పారు. ఉగ్రమూకలను ప్రోత్సహించే దేశానికి చెందిన ఆటగాళ్లకు ఇలాంటి సన్మానాలు తప్పవు. ఇలాంటి వారికి గంభీరే కరెక్ట్‌’’ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఆసియా కప్‌-2025 టీ20 టోర్నీ: టీమిండియా వర్సెస్‌ పాకిస్తాన్‌
👉పాక్‌ స్కోరు: 127/9 (20)
👉టీమిండియా స్కోరు: 131/3 (15.5)
👉ఫలితం: పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.

చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)