Breaking News

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఎంగేజ్‌మెంట్‌.. పాక్‌ ఓవరాక్షన్‌ స్పిన్నర్‌ రిసెప్షన్

Published on Wed, 10/08/2025 - 07:47

అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి తాజాగా రెండు శుభకార్యాలు జరిగాయి. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) తన దీర్ఘకాల ప్రియురాలు లూసీ లైల్స్‌తో నిశ్చితార్థం చేసుకోగా.. పాక్‌ ఓవరాక్షన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ (Abrar Ahmed) వివాహ రిసెప్షన్‌ వేడుక జరిగింది.

ముందుగా బ్రూక్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ యువ కెరటం లూసీ లైల్స్‌తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరు 2020లో తొలిసారి పబ్లిక్‌గా కనిపించారు. లూసీతో ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని బ్రూక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించాడు. 

లూసీ చేతిలో నిశ్చితార్థ ఉంగరం కనిపించే ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానుల బ్రూక్‌-లూసీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లూసీ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి మానసిక ఆరోగ్యం, విద్యా రంగానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. బ్రూక్‌ ప్రస్తుతం ఎలాంటి కమిట్‌మెంట్స్‌ లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. అక్టోబర్‌ 18 నుంచి ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది.

అబ్రార్‌ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ ఓవరాక్షన్‌ స్పిన్నర్‌ కొద్ది రోజుల కిందట అమ్నా రహీం​ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం తాజాగా కరాచీలో జరిగింది. ఈ వేడుకకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ మొహిసిన్‌ నఖ్వీ సహా పలువురు పాక్‌ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. ఆసియా కప్‌-2025లో నఖ్వీకి, పాక్‌ జట్టుకు ఘోర అవమానాలు ఎదురైన తర్వాత జరిగిన వేడుక కావడంతో అబ్రార్‌ రిసెప్షన్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో భారత్‌ పాక్‌ను ఫైనల్‌ సహా మూడు సార్లు ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. అలాగే ఏసీసీ చీఫ్‌గా ఉన్న పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదు. 

భారత ఆటగాళ్లు తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించడంతో నఖ్వీ దాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. తదనంతర పరిణామాల్లో నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్‌ బోర్డుకు అప్పజెప్పాడని ప్రచారం జరిగినప్పటికీ క్లారిటీ లేదు. ఈ మధ్యలో భారత జట్టు పాక్‌ను మరోసారి చిత్తుగా ఓడించింది. మహిళల వన్డే ప్రపంచకప్‌-2025లో భాగంగా కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై ఘన విజయం సాధించింది. 

చదవండి: స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన టీమిండియా.. సంతోషం ఎంతో సేపు మిగల్లేదు..!

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)