Breaking News

బ్రూక్‌ శతకంతో ఇంగ్లండ్‌ సెమీస్‌కు

Published on Wed, 02/25/2026 - 02:47

టి20 వరల్డ్‌ కప్‌లో ‘సూపర్‌ ఎయిట్స్‌’లోకి అడుగు పెట్టినా ఇంగ్లండ్‌ జట్టు బ్యాటింగ్‌లో ఇంకా తడబాటు... వరుసగా నాలుగు మ్యాచ్‌లలో తానూ విఫలం కావడంతో విమర్శల ఒత్తిడి... ఇలాంటి స్థితిలో కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ అదనపు బాధ్యత తీసుకున్నాడు... 61 మ్యాచ్‌ల కెరీర్‌లో తొలిసారి మూడో స్థానంలోకి దిగి జట్టును గెలిపించే భారాన్ని భుజాన వేసుకున్నాడు. 

165 పరుగుల లక్ష్య ఛేదనలో తనొక్కడే 100 పరుగులు చేసి ఒంటిచేత్తో టీమ్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైన పాకిస్తాన్‌... బౌలింగ్‌లో ఇతర బ్యాటర్లను నిలువరించగలిగింది గానీ బ్రూక్‌ను ఆపలేక మ్యాచ్‌ను అప్పగించింది. ఫలితంగా ఆ జట్టు సెమీస్‌ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి!  

పల్లెకెలె: టి20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ వరుసగా ఐదోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ‘సూపర్‌–8’లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్‌–2 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై నెగ్గింది. ముందుగా పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఫర్హాన్‌ (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హ్యారీ బ్రూక్‌ (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి టి20 సెంచరీతో జట్టును గెలిపించాడు. మొదటి  మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన ఇంగ్లండ్‌ ఇప్పుడు పాక్‌పై గెలిచి ముందంజ వేసింది. మరోవైపు పాక్‌ సెమీస్‌ చేరే అవకాశాలకు గండిపడింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై తప్పనిసరిగా గెలవడంతో పాటు ఇతర సమీకరణాలు, రన్‌రేట్‌లపై ఆ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది. 

దక్కని శుభారంభం 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌కు శుభారంభం లభించలేదు. సయీమ్‌ అయూబ్‌ (7), కెప్టెన్‌ సల్మాన్‌ ఆగా (5) తమ వైఫల్యాలను కొనసాగించారు. ఈ దశలో ఫర్హాన్, బాబర్‌ ఆజమ్‌ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లేలో ఒక్క సిక్సర్‌ కూడా లేకుండా పాక్‌ 46 పరుగులు చేసింది. ఆ తర్వాతా ఇంగ్లండ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జట్టు ఒకదశలో వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే కొట్టలేకపోయింది! 

ఈ క్రమంలో బాబర్‌ వెనుదిరగ్గా,  ఫఖర్‌ జమాన్‌ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రం కాస్త దూకుడుగా ఆడాడు. మరోవైపు 37 బంతుల్లో ఫర్హాన్‌ అర్ధసెంచరీ పూర్తయింది. 16 ఓవర్లలో స్కోరు 126/4. అయితే చివరి 4 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసిన టీమ్‌ 5 వికెట్లు కోల్పోయింది. షాదాబ్‌ (11 బంతుల్లో 23; 4 ఫోర్లు) కాస్త ధాటిని ప్రదర్శించడంతో స్కోరు 160 పరుగులు దాటింది.  

హడలెత్తించిన అఫ్రిది 
ఛేదనలో ఇంగ్లండ్‌ను ఆరంభంలోనే షాహిన్‌ షా అఫ్రిది దెబ్బ తీశాడు. తన తొలి బంతికే ఫిల్‌ సాల్ట్‌ (0)ను అవుట్‌ చేసిన అతను... తన రెండో ఓవర్లో జోస్‌ బట్లర్‌ (2)ను, మూడో ఓవర్లో బెతెల్‌ (8)ను వెనక్కి పంపించాడు. అయితే ఈ స్థితిలో బ్రూక్‌ ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. నవాజ్‌ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టడంతో పవర్‌ప్లేలో టీమ్‌ స్కోరు 53 పరుగులకు చేరింది. తక్కువ వ్యవధిలో బాంటన్‌ (2), స్యామ్‌ కరన్‌ (16) అవుటైనా... మరోవైపు బ్రూక్‌ 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. 

ఆ తర్వాతా అతను అదే ధాటిని కొనసాగించగా, విల్‌ జాక్స్‌ (23 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అలవోకగా షాట్లు ఆడిన బ్రూక్‌... అఫ్రిది బౌలింగ్‌లో మిడాఫ్‌ మీదుగా భారీ సిక్స్‌తో శతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత తడబడినా... చివరకు ఐదు బంతుల ముందే ఇంగ్లండ్‌ గట్టెక్కింది.  

స్కోరు వివరాలు  
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫర్హాన్‌ (ఎల్బీ) (బి) ఒవర్టన్‌ 63; అయూబ్‌ (సి) బెతెల్‌ (బి) ఆర్చర్‌ 7; సల్మాన్‌ (సి) ఒవర్టన్‌ (బి) డాసన్‌ 5; బాబర్‌ (బి) ఒవర్టన్‌ 25; ఫఖర్‌ (సి) డాసన్‌ (బి) రషీద్‌ 25; షాదాబ్‌ (రనౌట్‌) 23; ఉస్మాన్‌ (సి) ఒవర్టన్‌ (బి) డాసన్‌ 8; నవాజ్‌ (ఎల్బీ) (బి) డాసన్‌ 0; అఫ్రిది (సి) స్యామ్‌ కరన్‌ (బి) ఆర్చర్‌ 2; సల్మాన్‌ మీర్జా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–14, 2–27, 3–73, 4–122, 5–132, 6–146, 7–146, 8–149, 9–164. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–32–2, ఒవర్టన్‌ 3–0–26–2, డాసన్‌ 4–0–24–3, స్యామ్‌ కరన్‌ 3–0–24–0, రషీద్‌ 4–0– 31–1, జాక్స్‌ 2–0–27–0.  

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) ఉస్మాన్‌ (బి) షాహిన్‌ అఫ్రిది 0; బట్లర్‌ (సి) ఉస్మాన్‌ (బి) షాహిన్‌ అఫ్రిది 2; బ్రూక్‌ (బి) షాహిన్‌ అఫ్రిది 100; బెతెల్‌ (సి) ఫర్హాన్‌ (బి) షాహిన్‌ అఫ్రిది 8; బాంటన్‌ (సి) ఉస్మాన్‌ (బి) తారిఖ్‌ 2; స్యామ్‌ కరన్‌ (సి) నవాజ్‌ (బి) తారిఖ్‌ 16; జాక్స్‌ (బి) నవాజ్‌ 28; ఒవర్టన్‌ (స్టంప్డ్‌) ఉస్మాన్‌ (బి) నవాజ్‌ 0; డాసన్‌ (నాటౌట్‌) 1; ఆర్చర్‌ (నాటౌట్‌) 5; మొత్తం (19.1 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–35, 4–58, 5–103, 6–155, 7–160, 8–161. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 4–0–30–4, సల్మాన్‌ మీర్జా 3.1–0–26–0, సయీమ్‌ అయూబ్‌ 2–0–21–0, నవాజ్‌ 3–0–26–2, షాదాబ్‌ ఖాన్‌ 3–0–31–0, ఉస్మాన్‌ తారిఖ్‌ 4–0–31–2.  

3 ఇంగ్లండ్‌ తరఫున మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా హ్యారీ బ్రూక్‌ నిలిచాడు. గతంలో జోస్‌ బట్లర్, డేవిడ్‌ మలాన్‌ మాత్రమే ఈ ఘనత నమోదు చేశారు. ఓవరాల్‌గా ఏ జట్టు తరఫునైనా టి20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి  కెప్టెన్‌గా కూడా బ్రూక్‌ గుర్తింపు పొందాడు.  

టి20 ప్రపంచకప్‌లో నేడు
శ్రీలంక  X  న్యూజిలాండ్‌
వేదిక: కొలంబో రాత్రి 7 గంటల నుంచి  
స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)