Breaking News

మెస్సీ, ఎంబాపె కాదు.. అత‌డిదే 'బాల‌న్ డి ఓర్‌' అవార్డు

Published on Tue, 10/27/2026 - 07:23

ఫుట్‌బాల్ ఆట‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే బాలన్ డి ఓర్ 2026 అవార్డును ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు కోసం ఫ్రాన్స్ స్టార్ కైలియ‌న్ ఎంబాపె, స్పెయిన్ సంచ‌ల‌నం లామిన్‌ య‌మాల్, అర్జెంటీనా దిగ్గ‌జం లియోన‌ల్ మెస్సీల‌ నుంచి తీవ్ర‌మైన పోటీ ఎదురైన‌ప్ప‌టికీ, హ్యారీ కేన్ వారిని దాటుకొని అవార్డు అందుకోవ‌డం విశేషం.

2001 త‌ర్వాత ఇంగ్లండ్ ఆట‌గాడు బాలన్ డి ఓర్ పుర‌స్కారం అందుకోవ‌డం మ‌ళ్లీ ఇదే. గ‌తంలో 2001లో మైకెల్ ఓవెన్ ఈ అవార్డు సొంతం చేసుకోగా, తాజాగా 25 ఏళ్ల త‌ర్వాత హ్యారీ కేన్ రూపంలో మ‌రో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ బాలన్ డి ఓర్ ద‌క్కించుకున్నాడు. ఇక మ‌హిళ‌ల ఫుట్‌బాల్ బాల‌న్ డి ఓర్ అవార్డును స్పెయిన్ స్టార్ అలెక్సియా పుటెల్లాస్ సొంతం చేసుకుంది. ఆమె ఈ అవార్డు తీసుకోవ‌డం ఇది మూడోసారి.

బాల‌న్ డి ఓర్ రేసులో హ్యారీ కేన్ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, కైలియన్ ఎంబాపె (రియల్ మాడ్రిడ్, ఫ్రాన్స్), లామిన్ యమల్ (బార్సిలోనా, స్పెయిన్), రోడ్రి (మ్యాన్ సిటీ/బార్సిలోనా, స్పెయిన్), లియోనెల్ మెస్సీ (ఇంటర్ మయామి, అర్జెంటీనా) వ‌రుస‌గా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఇక ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న హ్యారీకేన్ బేయ‌ర్ మునిచ్‌కు రెండు వ‌రుస ట్రోఫీలు అందించాడు. అంతేకాదు 2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో హ్యారీ కేన్ సార‌థ్యంలోని ఇంగ్లండ్ బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. 

ఇక ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఏడు మ్యాచ్‌లాడిన హ్యారీకేన్ ఆరు గోల్స్ చేయ‌డంతో పాటు ఒక అసిస్ట్ అందించాడు. 2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ను స్పెయిన్ గెల‌వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన లామిన్‌ య‌మాల్ వ‌రుస‌గా మూడో ఏడాది మెన్స్ కోపా ట్రోఫీ (బెస్ట్ యంగ్ ప్లేయ‌ర్‌) అవార్డు అందుకున్నాడు.

అవార్డుల వివ‌రాలు..
పురుషుల బాల‌న్ డి ఓర్‌: హ్యారీ కేన్
మహిళల బాల‌న్ డి ఓర్‌: అలెక్సియా పుటెల్లాస్
పురుషుల కోపా ట్రోఫీ: లామిన్ యమల్
మహిళల కోపా ట్రోఫీ: విక్కీ లోపెజ్
పురుషుల యాషిన్ ట్రోఫీ: ఉనై సైమన్
మహిళల యాషిన్ ట్రోఫీ: కాటా కోల్

పురుషుల కోచ్ ఆఫ్ ది ఇయర్: లూయిస్ డి లా ఫ్యూంటె
మహిళల కోచ్ ఆఫ్ ది ఇయర్: పెరె రోమ్యూ
పురుషుల క్లబ్ ఆఫ్ ది ఇయర్: పారిస్ సెయింట్-జెర్మైన్
మహిళల క్లబ్ ఆఫ్ ది ఇయర్: ఎఫ్‌సి బార్సిలోనా
పురుషుల గెర్డ్ ముల్లర్ ట్రోఫీ: హ్యారీ కేన్
మహిళల గెర్డ్ ముల్లర్ ట్రోఫీ: చార్లిన్ కొర్రల్
సోక్రటీస్ అవార్డు: బుకాయో సాకా

 

ఇదీ చదవండి: 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)