Breaking News

‘రిఫ‌రీ చీటింగ్‌తోనే అర్జెంటీనాకు విజ‌యం’

Published on Wed, 07/08/2026 - 19:04

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో అర్జెంటీనా క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. మంగ‌ళ‌వారం రాత్రి ప్రిక్వార్ట‌ర్స్‌లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను ఓడించి క్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. అయితే మ్యాచ్‌లో ఓడిన‌ప్ప‌టికీ ఈజిప్ట్ మాత్రం అర్జెంటీనాకు ముచ్చెమ‌టలు ప‌ట్టించింది. ఒక ద‌శ‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచిన ఈజిప్ట్ అర్జెంటీనాను ఓడించినంత ప‌ని చేసింది. 

అయితే చివ‌రి నిమిషాల్లో  మూడు గోల్స్ కొట్టిన అర్జెంటీనా విజ‌యం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఈజిప్ట్ జ‌ట్టు రిఫ‌రీపై ఫిఫాకు ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తి క‌లిగించింది. మ్యాచ్ జ‌రుగుతున్నంత సేపు రిఫ‌రీ అర్జెంటీనాకు అనుకూలంగా చాలా నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని, అత‌డిని వెంట‌నే తొల‌గించాల‌ని ఫిఫాకు రాసిన ఫిర్యాదు లేఖ‌లో పేర్కొంది.

వీఏఆర్ స‌మీక్ష త‌ర్వాత గోల్‌ను తిర‌స్క‌రించ‌డ‌మే గాక‌, అర్జెంటీనా విజ‌యానికి దారి తీసిన చివ‌రి గోల్ పెనాల్టీ అప్పీల్‌ను స‌మీక్షించ‌క‌పోవ‌డం స‌హా చాలా నిర్ణ‌యాలు ఈజిప్ట్‌కు వ్య‌తిరేకంగా రావ‌డంపై ఆ జ‌ట్టు శిబిరం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు హ‌నీ అబో రిడా.. ఫ్రెంచ్ రిఫ‌రీ ఫ్రాంకోయిస్ లెటెక్సియ‌ర్‌, మిగిలిన బృందంపై ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. 

త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో ఈజిప్ట్ విజ‌యాన్ని ఉద్దేశ‌పూర్వ‌కంగా అడ్డుకోవ‌డం కింద‌కు వ‌స్తుంద‌ని తెలిపిన హ‌నీ అబో, విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. ఫ్రెంచ్ రిఫ‌రీ బృందాన్ని మిగిలిన టోర్నీ మ్యాచ్‌ల్లో పాల్గొన‌కుండా తొలగించాల‌ని హ‌నీ అబో ఫిఫాను అభ్య‌ర్థించారు. మ్యాచ్ విష‌యానికొస్తే.. రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను మ‌ట్టిక‌రిపించింది. 

అర్జెంటీనా త‌ర‌ఫున క్రిస్టియన్ రోమెరో (79వ నిమిషం), లియోన‌ల్ మెస్సీ (83వ నిమిషం), యెంజో ఫెర్నాండేజ్ (90+3వ నిమిషం) ఆట ఆఖ‌రి నిమిషంలో మూడు గోల్స్ కొట్టారు. మ‌రోవైపు ఈజిప్ట్ త‌ర‌ఫున యాస‌ర్ ఇబ్ర‌హీం (15వ నిమిషం), మొస్తాఫా జికో (67వ నిమిషం) గోల్స్ సాధించారు. ఇక క్వార్టర్ ఫైన‌ల్లో మెస్సీ బృందం జూలై 12న ఉద‌యం 6.30 గంట‌ల‌కు స్విట్జ‌ర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

Read: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. గాయంతో కీల‌క ప్లేయ‌ర్ దూరం!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)