Breaking News

‘షర్మిలా ఠాగూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’

Published on Mon, 06/30/2025 - 13:36

ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య టెస్టు సిరీస్‌కు కొత్త పేరు పెట్టడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్‌ ఫారూఖ్‌ ఇంజనీర్‌ (Farookh Engineer) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌- వేల్స్‌ క్రికెట్‌ బోర్డు తన విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించాడు. భారత క్రికెట్‌ రంగానికి సేవ చేయడంతో పాటు ఇంగ్లండ్‌కూ ఆడిన మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ (Mansur Ali Khan Pataudi) పేరు తొలగించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదన్నాడు.

గొప్ప కుటుంబం
కాగా ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ను గతంలో పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా ఈ సిరీస్‌కు టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేసింది ఈసీబీ. ఈ క్రమంలో విమర్శలతో పాటు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నుంచి విజ్ఞప్తి రాగా.. విజేత జట్టు కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ను అందజేస్తామని ప్రకటించింది. తద్వారా పటౌడీ పేరు చిరస్మరణీయం కానుంది.

అయితే, ఈసీబీ నిర్ణయం తనకు అంతగా సంతృప్తినివ్వలేదని షారూఖ్‌ ఇంజనీర్‌ అన్నాడు. ‘‘టైగర్‌ పటౌడీ నాకు స్నేహితుడు. ఇద్దరం కలిసి చాన్నాళ్లు క్రికెట్‌ ఆడాము. అతడిది గొప్ప వారసత్వం. వారిది గొప్ప కుటుంబం. 2007లో పటౌడీ ట్రోఫీని ప్రవేశపెట్టినపుడు ఎంతో సంతోషించా.

షర్మిలా ఠాగూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ను పిలవండి
అయితే, ఇప్పుడు ఆ పేరును తీసేయడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆండర్సర్‌- టెండుల్కర్‌ కూడా దిగ్గజ ఆటగాళ్లే. వారికి ఎవరూ సాటిరారు. ట్రోఫీకి వారి పేరు పెట్టడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఇలాంటి చర్య వల్ల ఈసీబీ తన విశ్వసనీయతను కోల్పోయింది.

మెడల్‌ ఇస్తామంటూ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మెడల్‌ అందిస్తామని చెప్పింది. కేవలం ఇలా చేస్తే సరిపోదు. మన్సూర్‌ భార్య షర్మిలా ఠాగూర్‌, కుమారుడు సైఫ్‌ అలీ ఖాన్‌ల చేతుల మీదుగా ఆ పతకం విజేత జట్టు కెప్టెన్‌కు అందజేయాలి. 

ఈసారి ఇలా చేయడం వల్ల ఈసీబీ వైపు ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదు’’ అని ఫారూఖ్‌ ఇంజనీర్‌ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్‌ నటి షర్మిలాను పెళ్లాడిన మన్సూర్‌కు కుమారుడు సైఫ్‌తో పాటు కుమార్తెలు సబా, సోహా ఉన్నారు. 

ఇదిలా ఉంటే.. తాజా ఇంగ్లండ్‌ పర్యటనను టీమిండియా పరాజయంతో మొదలుపెట్టింది. లీడ్స్‌ వేదికగా తొలి టెస్టులో గిల్‌ సేన.. స్టోక్స్‌ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య మొత్తంగా ఐదు టెస్టులు జరుగనుండగా.. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం రెండో మ్యాచ్‌ (జూలై 2-6)కు వేదిక. 
 చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా?

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)